అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా వెటరన్ బ్యాటర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే గుడ్‌బై చెప్పనున్నారా? సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరగనున్నమూడో టెస్టు మ్యాచే వారి కెరీర్లో చివరిదా? అంటే అవుననే అంటుంది ఒక వర్గం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేప్‌టౌన్ వేదికగా జరగబోతున్న మూడో టెస్టు మ్యాచ్ తర్వాత అంతర్జాతీ క్రికెట్‌కు పుజారా, రహానే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారట. ఎందుకంటే ఇప్పుడున్న ఫామ్ దృష్యా సౌతాఫ్రికా పర్యటన తర్వాత రహానే, పుజారా జట్టులో చోటు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల్లో వీరిద్దరు ఘోరంగా విఫలమయ్యారు. జోహన్నెస్‌బర్గ్ టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించినప్పటికీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. వీరికి మిగిలింది ఇక మూడో టెస్టే. అక్కడ కూడా విఫలమైతే టీంలో స్థానం కోల్పోవడం ఖాయం.
ఇప్పుడున్న ఫామ్ దృష్యా పుజారా, రహానే మూడో టెస్టులో రాణించి జట్టులో చోటు నిలబెట్టుకుంటారనే ఆశలు ఎవరికీ లేవు. ఒక వేళ జట్టులో చోటు దక్కాలంటే కేప్‌టౌన్ టెస్టు మ్యాచ్‌లో వీరిద్దరు కచ్చితంగా సెంచరీ కొట్టాల్సిందే. అది జరగక జట్టులో చోటు కోల్పోతే మళ్లీ రీఎంట్రీ కష్టమని క్రికెట్ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ప్రస్తుతం వీరి వయస్సు 33 ఏళ్లు. ఈ వయసులో టీంలో చోటు కోల్పోతే మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం కూడా కష్టమే చెబుతున్నారు. దీనికి తోడు టీమిండియా బెంచ్ బలంగా ఉంది. బెంచ్‌లో శ్రేయస్ అయ్యర్, హనుమ విహారీ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. పైగా వీరిద్దరు ఇప్పటికే తమ సత్తా ఎంటో నిరుపించుకున్నారు. కేవలం సీనియర్లనే కారణంతోనే ఫామ్‌లో లేకపోయినా అయ్యర్, విహారిని పక్కన పెట్టి మరి పుజారా, రహానేను మేనేజ్మెంట్ జట్టులోకి తీసుకుంటుంది. కానీ వీరు తమ సత్తాను నిరూపించులేకపోతున్నారు. ఇప్పటికే వారికి చాలా అవకాశాలు ఇచ్చారని, ఇక జట్టు నుంచి సాగనంపాలని అభిమానులతోపాటు మాజీలు కోరుతున్నారు.
ఒక వేళ జట్టులో చోటు కోల్పోతే పుజారా, రహానేకు మిగిలింది ఇక రిటైర్మెంట్ ప్రకటించడమేనని కొందరు వాదిస్తున్నారు. అయితే టీంలో చోటు కోల్పోయి అవమానపడడం కన్నా రిటైర్మెంట్ ప్రకటించడమే మేలు అనే ఆలోచనలో పుజారా, రహానే ఉన్నారని సమాచారం. అందుకే రిటైర్మెంట్ విషయమై వారు సన్నిహితులతోపాటు కుటుంబసభ్యులతో చర్చిస్తున్నారని తెలిసింది. చాలా కాలంగా టీమిండియాకు సేవ చేసి మంచి గౌరవం, గుర్తింపు దక్కించుకున్న పుజారా, రహానే అదే గౌరవంతో తప్పుకోవాలని ఆలోచిస్తున్నారట. జట్టు మేనేజ్మెంట్ కూడా ఈ దిశగానే ఆలోచిస్తుందని సమాచారం. ఇదే నిజమైతే కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరగబోయే టెస్టు మ్యాచే పుజారా, రహానే కెరీర్లో చివరిది అవుతుంది. పుజారా, రహానే రిటైర్మెంట్ ప్రకటన కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు గతంలో పలువురు క్రికెటర్లు ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పయే పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి నిర్ణయాలే తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి.