Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PSL: బాల్ బాయ్ సెన్సేషనల్ క్యాచ్ (Video)

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బాల్ బాయ్ సెన్సేషనల్ క్యాచ్ పట్టాడు. బౌండరీ రోప్ అవతల డైవ్ చేస్తూ ప్రొఫెషనల్ క్రికెటర్ రీతిలో అద్భుతంగా బంతిని ఒడిసిపట్టాడు. ఆ క్యాచ్‌ను చూసి ఫిదా అయిన స్టార్ క్రికెటర్ కొలిన్ మన్రో బాల్‌బాయ్‌ను హగ్ చేసుకుని మెచ్చుకున్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ వర్సెస్ పెషావర్ జల్మీ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

పెషావర్ జల్మి ఇన్నింగ్స్‌లో రుమ్మన్ రయీస్ 19వ ఓవర్ బౌలింగ్ చేశాడు. స్లోగా వచ్చిన అయిదో బంతిని ఆరిఫ్ యాకూబ్ డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదగా సిక్సర్‌గా మలిచాడు. అదే ప్లేస్‌లో మన్రో ఫీల్డింగ్‌ చేశాడు. బంతిని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ అందనంత ఎత్తులో వెళ్లింది. మరోవైపు మన్రో‌కు సమాంతరంగా బాల్ బాయ్ కూడా క్యాచ్‌కు ట్రై చేశాడు. డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు.

PSL Ball boy takes a sensational catch Video goes viral

అనంతరం ఆనందంలో మునిగిపోయిన ఆ కుర్రాడితో కలిసి మన్రో కూడా సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బాల్‌బాయ్‌ టాలెంట్‌ను ప్రోత్సహించిన మన్రోను నెటిజన్లు కొనియాడుతున్నారు. అంతకుముందు మరో క్యాచ్ కోసం ట్రై చేసిన ఆ బాల్‌బాయ్ దాన్ని అందుకోలేకపోయాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పెషావర్ జల్మీ‌పై ఇస్లామాబాద్ యునైటెడ్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. కెప్టెన్ షాదాబ్ ఖాన్ (80; 51 బంతుల్లో) సత్తాచాటాడు. అజామ్ ఖాన్ (29; 14 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. ఓపెనర్ మన్రో (15; 9 బంతుల్లో) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. సయిమ్ అయుబ్ రెండు వికెట్లు తీశాడు.

అనంతరం ఛేదనకు వచ్చిన పెషావర్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అమీర్ జమాల్ (87; 49 బంతుల్లో) పోరాడాడు. కెప్టెన్ బాబర్ అజామ్ డకౌటయ్యాడు. 18 పరుగులకే పెషావర్ అయిదు వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు ఓటమి ఖరారైపోయింది. కానీ జమాల్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. పెషావర్ శిబిరంలో గెలుపు ఆశలు రేకెత్తించాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు.

Story first published: Tuesday, March 5, 2024, 11:36 [IST]
Other articles published on Mar 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+