For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొయిన్ అలీ vs డేవిడ్ వార్నర్.. డిష్యూం.. డిష్యూం! (వీడియో)

PSL 2026: ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) 2026 సీజన్ సరికొత్త వివాదానికి తెరలేపింది. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్, కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, అదే జట్టు సభ్యుడైన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీతో బహిరంగంగా గొడవకు దిగడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

స్టేడియంలోనే మాటల యుద్ధం
గురువారం కరాచీ కింగ్స్, రావల్పిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్న డేవిడ్ వార్నర్, మొయిన్ అలీ మధ్య ఏదో విషయంలో విభేదాలు తలెత్తాయి. ఆ వీడియోలో డేవిడ్ వార్నర్ చాలా కోపంగా కనిపిస్తూ మొయిన్ అలీపై అరుస్తున్నట్లు స్పష్టమవుతోంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో జట్టులోని ఇతర సభ్యులు వచ్చి వారిద్దరినీ విడదీయాల్సి వచ్చింది. ఒకే జట్టులో ఉన్న ఇద్దరు సీనియర్ ప్లేయర్లు ఇలా గొడవపడటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

PSL 2026 David Warner and Moeen Ali Involved in Heated On-Field Spat Despite the win Video Goes Viral

గెలుపొందినా తగ్గని ఉద్రిక్తత
విశేషమేమిటంటే.. ఈ గొడవ జరిగినప్పటికీ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. కరాచీ కింగ్స్ ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 6 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జట్టు విజయపథంలో ఉన్న సమయంలో ఇలాంటి అంతర్గత విభేదాలు బయటపడటం జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారింది.

ఆకట్టుకున్న ఆజం ఖాన్, డేవిడ్ వార్నర్
లాహోర్లోని గడాఫీ స్టేడియంలో రావల్పిండీస్, కరాచీ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. రావల్పిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 197 పరుగులు చేసింది. డారిల్ మిచెల్(65) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కరాచీ బౌలర్ హసన్ అలీ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కరాచీ కింగ్స్ 198 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఆజం ఖాన్(74) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 50 పరుగులతో రాణించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్, కీలక ఆటగాడి మధ్య గొడవ ఎందుకు జరిగిందనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Friday, April 3, 2026, 10:42 [IST]
Other articles published on Apr 3, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+