For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్‌కు వార్నర్ గట్టి కౌంటర్.. ఐపీఎల్ విషయంలో!

David Warner: ఐపీఎల్ అంటే తెలుగు క్రికెటర్లకు ధోనీ, కోహ్లీ, రోహిత్ తో పాటు టక్కున గుర్తొచ్చేది డేవిడ్ వార్నర్. అలాంటి వార్నర్‌ను ముందు సన్‌రైజర్స్ వదిలేస్తే, తర్వాత దిల్లీ క్యాపిటల్స్ వదులుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఎవరు కొనుగోలు చేయకపోవడంతో పూర్తిగా ఐపీఎల్ కు దూరమయ్యాడు. అయితే ఇప్పుడతడు పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. కరాచీ కింగ్స్ జట్టు వార్నర్‌ను, పీఎస్ఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు రూ.2.58 కోట్లకు కొనుగోలు చేసింది. పైగా అతడికి కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది.

అదిరిపోయే రిప్లై..
ఈ నేపథ్యంలో తొన తొలి మ్యాచుకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పాల్గొన్న వార్నర్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. "ఈ ఐపీఎల్ 2025 సీజన్‌లో మీరు అన్ సోల్డ్‌గా మిగిలిపోయాక.. పీఎస్ఎల్‌లో ఆడుతుంటే చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, దానికి మీ సమాధానం ఏంటి" అని అడిగాడు. అప్పుడు వార్నర్.. పాక్ రిపోర్టర్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

PSL 2025 Warner gave stunning reply to pakisthan reporter for unsold in ipl 2025 auction

ఇదే తొలిసారి వినడం..
''నేను ఇలాంటిది వినడం ఇదే తొలిసారి. నేను కేవలం క్రికెట్ మాత్రమే ఆడాలనుకుంటాను. పీఎస్‌ఎల్‌లో భాగస్వామ్యమవ్వడానికి అవకాశం వచ్చింది. గతంలో నా అంతర్జాతీయ మ్యాచుల కారణంగా పీఎస్‌ఎల్‌లో ఆడలేకపోయాను. ఇప్పుడు కరాచి కింగ్స్‌ కెప్టెన్ గా, జట్టును గెలిపించేందుకు రంగంలోకి దిగబోతున్నాను'' అని వార్నర్ పేర్కొన్నాడు.

వార్నర్ రికార్డులు..
వార్నర్ గత ఐపీఎల్ సీజన్‌ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడాడు. ఆ జట్టుకు సారథిగానూ వ్యవహరించాడు. ఇప్పుడు పీఎస్ఎల్ కోసం సిద్ధమయ్యాడు. కరాచీ కింగ్స్.. ప్లాటినమ్ కేటగిరి కింద అతడిని కొనుగోలు చేసింది. వార్నర్.. తన టీ20 కెరీర్ లో 37.00 సగటుతో, 140.23 స్ట్రైక్ రేటుతో 399 మ్యాచుల్లో 12,913 పరుగులు చేశాడు.

Story first published: Saturday, April 12, 2025, 16:48 [IST]
Other articles published on Apr 12, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+