Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PSL 2025: భారత్-పాక్ యుద్ధం.. పీసీబీ సంచలన నిర్ణయం

PSL 2025: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ భారత్‌లోని అనేక ప్రాంతాలపై కాల్పులు జరిపింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ ప్రతీకార చర్యను ప్రారంభించింది. భారత సైన్యం లాహోర్‌తో సహా పాకిస్థాన్‌లోని అనేక పెద్ద నగరాలపై దాడి చేసింది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ టీ20 లీగ్ పీఎస్ఎస్ 2025లో మిగిలిన మ్యాచ్‌లు ఆ దేశంలో జరగవు. భారత్ చేసిన దాడుల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో రావల్పిండి స్టేడియం వద్దకు కూడా ఓ డ్రోన్ చేరుకున్నట్లు తెలిసింది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ సైన్యం 28 భారత డ్రోన్లను కూల్చివేసిందని అన్నారు. ఈ డ్రోన్లలో ఒకటి గురువారం సిటీ స్టేడియం సమీపంలో ఉంది. దీనిని దేశీయ, విదేశీ క్రికెటర్లను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశపూర్వక ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు.

యూఏఈలో పీఎస్ఎల్ మ్యాచ్‌లు
పాకిస్థాన్ సూపర్ లీగ్ మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఫ్రాంచైజీలు, పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మధ్య జరిగిన అనేక సమావేశాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. విదేశీ ఆటగాళ్లు పాకిస్థాన్‌లో ఉండడానికి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌పై భారత్ వైమానికి దాడులు నిర్వహించింది. దీని తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది.

PSL 2025 Shifted to UAE After India-Pakistan Conflict PCB s Big Decision

మరోవైపు పాకిస్థాన్ సైన్యం 28 భారత డ్రోన్లను కూల్చివేసిందని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. గురువారం ఉదయం రావల్పిండి స్టేడియం సమీపంలో ఒక డ్రోన్ కనిపించిందని కూడా ఆయన అన్నారు. దీనిని క్రికెట్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకోవడానికి ప్లాన్ చేసిన కుట్ర అంటూ ఇషాక్ దార్ అభివర్ణించాడు. ఇది దేశీయ, విదేశీ క్రికెటర్లను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశపూర్వక ప్రయత్నం అంటూ చెప్పుకొచ్చాడు.

గురువారం మ్యాచ్ రద్దు..
మ్యాచ్ ల కొత్త షెడ్యూల్ ను త్వరలో విడుదల చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం రావల్పిండి స్టేడియంలో కరాచీ కింగ్స్, పెషావర్ జల్మీ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ డ్రోన్ దాడి తర్వాత మ్యాచ్ రద్దు చేయబడింది. ఈ పీఎస్ఎల్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 37 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు పాకిస్థాన్‌లో ఉండడానికి ఇష్టపడడం లేదని పలు వర్గాలు తెలిపాయి.

2009 లాహోర్‌లో శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రవాద దాడి జరిగింది. దీని తర్వాత పాకిస్థాన్ అంతర్జాతీయ క్రికెట్ ఆగిపోయింది. 2019లో పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ ప్రారంభమైంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ బీసీసీఐ అక్కడికి జట్టును పంపడానికి నిరాకరించింది. ఫైనల్‌తో సహా భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లోనే జరిగాయి.

Story first published: Friday, May 9, 2025, 9:11 [IST]
Other articles published on May 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+