PSL 2025: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్(పాకిస్థాన్ సూపర్ లీగ్) 2025 షెడ్యూల్ ను ప్రకటించింది. ఏప్రిల్ 11న జరిగే తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇస్లామాబాద్ యునైటెడ్.. లాహోర్ ఖలందర్స్ తో తలపడనుంది. ఈ లీగ్ దశలో మొత్తం 30 మ్యాచ్ లు జరుగుతాయి. దీని తర్వాత.. క్వాలిఫైయర్, ఎలిమినేటర్ 1, ఎలిమినేటర్ 2 మ్యాచ్ లు వరుసగా మే 13, మే 14, మే 16 తేదీలలో జరుగుతాయి. పీఎస్ఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ మే 18,2025న లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరుగుతుంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ మార్చి 11 నుంచి ప్రారంభం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ లాహోర్ వేదికగా.. మే 18న జరగనుంది. ఈ టోర్నమెంట్ లో రావల్పిండి మైదానం మొత్తం 11 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. లాహోర్ లోని గడాఫీ స్టేడియం 13 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. కరాచీ, ముల్తాన్ లు చెరో 5 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025.. ఐపీఎల్ 2025తో పోటీ పడనుంది. ఎందుకంటే ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనుంది.

పాకిస్థాన్ సూపర్ లీగ్ సమయంలో వినోదానికి లోటు ఉందని పీఎస్ఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సల్మాన్ నజీర్ వెల్లడించారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ 10వ ఎడిషన్ షెడ్యూల్ ప్రకటించినందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. గత దశాబ్ధంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టోర్నమెంట్ గా మారిందన్నారు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025 షెడ్యూల్ ఇదే..
ఏప్రిల్ 11- ఇస్లామాబాద్ యునైటెడ్ vs లాహోర్ ఖలందర్స్- రావల్పిండి స్టేడియం
ఏప్రిల్ 12- పెషావర్ జల్మి vs క్వెట్టా గ్లాడియేటర్స్- రావల్పిండి స్టేడియం
ఏప్రిల్ 13- క్వెట్టా గ్లాడియేటర్స్ vs లాహోర్ ఖలందర్స్- రావల్పిండి స్టేడియం
ఏప్రిల్ 14- ఇస్లామాబాద్ యునైటెడ్ vs పెషావర్ జల్మి- రావల్పిండి స్టేడియం
ఏప్రిల్ 15- కరాచీ కింగ్స్ vs లాహోర్ ఖలందర్స్- కరాచీ, నేషనల్ బ్యాంక్ స్టేడియం
ఏప్రిల్ 16 - ఇస్లామాబాద్ యునైటెడ్ vs ముల్తాన్ సుల్తాన్స్- రావల్పిండి స్టేడియం
ఏప్రిల్ 18- కరాచీ కింగ్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్- కరాచీ
ఏప్రిల్ 19 - పెషావర్ జల్మి vs ముల్తాన్ సుల్తాన్స్ - రావల్పిండి స్టేడియం
ఏప్రిల్ 20- కరాచీ కింగ్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్ - కరాచీ
ఏప్రిల్ 21 - కరాచీ కింగ్స్ vs పెషావర్ జల్మి - కరాచీ
ఏప్రిల్ 22- ముల్తాన్ సుల్తాన్స్ vs లాహోర్ ఖలందర్స్ - ముల్తాన్ క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 23 - ముల్తాన్ సుల్తాన్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్- ముల్తాన్ క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 24 - లాహోర్ ఖలందర్స్ v పెషావర్ జల్మీ - లాహోర్ (గడాఫీ స్టేడియం)
ఏప్రిల్ 25- క్వెట్టా గ్లాడియేటర్స్ v కరాచీ కింగ్స్ - లాహోర్(గడాఫీ స్టేడియం)
ఏప్రిల్ 26 - లాహోర్ ఖలందర్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్- లాహోర్
ఏప్రిల్ 27 క్వెట్టా గ్లాడియేటర్స్ vs పెషావర్ జల్మీ - లాహోర్
ఏప్రిల్ 29- క్వెట్టా గ్లాడియేటర్స్ VS ముల్తాన్ సుల్తాన్స్ - లాహోర్
ఏప్రిల్ 30 - లాహోర్ ఖలందర్స్ VS ఇస్లామాబాద్ యునైటెడ్ - లాహోర్
మే 1- ముల్తాన్ సుల్తాన్స్ VS కరాచీ కింగ్స్ - ముల్తాన్ క్రికెట్ స్టేడియం:: లాహోర్ ఖలందర్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్- లాహోర్(గడాఫీ స్టేడియం)
మే 2- పెషావర్ జల్మి వర్సెస్ ఇస్లామాబాద్ యునైటెడ్ - లాహోర్
మే 3- క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ ఇస్లామాబాద్ - లాహోర్
మే 4- లాహోర్ ఖలందర్స్ v కరాచీ కింగ్స్ - లాహోర్
మే 5 - ముల్తాన్ సుల్తాన్స్ vs పెషావర్ జల్మి- ముల్తాన్ క్రికెట్ స్టేడియం
మే 7- ఇస్లామాబాద్ యునైటెడ్ vs క్వెట్టా గ్లాడియేటర్స్- రావల్పిండి స్టేడియం
మే 8- పెషావర్ జల్మి vs కరాచీ కింగ్స్- రావల్పిండి స్టేడియం
మే 9- పెషావర్ జల్మి vs లాహోర్ ఖలందర్స్- రావల్పిండి స్టేడియం
మే 10- ముల్తాన్ సుల్తాన్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ vs కరాచీ కింగ్స్-- రావల్పిండి స్టేడియం
మే 13- క్వాలిఫైయర్-1- రావల్పిండి స్టేడియం
మే 14- ఎలిమినేటర్-1-గడాఫీ స్టేడియం, లాహోర్
మే 16 - ఎలిమినేటర్-2- గడాఫీ స్టేడియం, లాహోర్
మే 18: ఫైనల్: గడాఫీ స్టేడియం, లాహోర్