IPL 2025 VS PSL 2025: ఐపీఎల్ వర్సెస్ పీఎస్ఎల్.. అంటూ ఎప్పుడూ మనతో పోటీ పడి చేతులు కాల్చుంటుంది పాకిస్థాన్. అయినా కూడా ఆ దేశ క్రికెటర్లకు అస్సలు బుద్ధి రాదు. ఐపీఎల్ కన్నా పీఎస్ఎలే గొప్ప అంటూ సొంత బడాయి కొట్టుకుని నవ్వుల పాలవుతుంటారు పాకిస్థాన్ క్రికెటర్లు. కడుపులో అక్కసు పెట్టుకుని ఐపీఎల్ పై లేనిపోని విమర్శలు చేస్తుంటారు. కానీ చివరికి వాళ్లే విమర్శలకు గురౌతుంటారు. అయితే ఈ సారి ఆ దేశ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా.. పీఎస్ఎస్ లో బ్లండర్ మిస్టేక్ చేశాడు. అది కూడా లైవ్ వీడియోలో దొరికిపోయాడు. దీంతో అది కాస్త సోషల్ మీడియా టాకింగ్ పాయింట్ గా మారిపోయింది. దీంతో రమీజ్ రాజాను చూసి క్రికెట్ అభిమానులంతా తెగ నవ్వుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే
పీఎస్ఎల్ లో భాగంగా ముల్తాన్ వేదికగా ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ లాహోర్ కాలాండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచులో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లాహోర్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా ముల్తాన్ సుల్తాన్స్ 33 పరుగులు తేడాతో గెలుపొందింది.

అయితే మ్యాచ్ తర్వాత క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ముల్తాన్ సుల్తాన్స్ కు చెందిన జాష్వా లిటిల్ కు ఇచ్చారు. ఫక్హర్ జమాన్ క్యాచ్ ను అద్భుతంగా పట్టుకున్నందుకు ఈ అవార్డు వరించింది. ఈ అవార్డును అతడికి ప్రజెంట్ చేసే సమయంలోనే రమీజ్ రాజా ఓ బ్లండర్ మిస్టేక్ చేశాడు. పీఎస్ఎల్ కు
బదులు ఐపీఎల్ అని అన్నాడు. కనీసం కరెక్ట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇదంతా లైవ్ టీవీలో రికార్డ్ అయింది.
దీంతో ఇది కాస్త క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. సోషల్ మీడియా అంతా దీనిపై జోక్స్, మీమ్స్ తో నిండిపోయింది. సొంత లీగ్ నే మర్చిపోయాడేంట్రా అంటూ నెటిజన్లు రమీజ్ రాజాను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఓ రేంజులో ఆటాడేసుకుంటున్నారు.