Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PSL 2025: అందువల్లే ఓడిపోయాం.. వరుసగా రెండో ఓటమిపై రిజ్వాన్ ఆగ్రహం

PSL 2025: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో మహమ్మద్ రిజ్వాన్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. బుధవారం రాత్రి రిజ్వాన్ కెప్టెన్సీలోని ముల్తాన్ సుల్తాన్స్.. షాదాబ్ ఖాన్ నేతృత్వంలోని ఇస్లామాబాద్ యునైటెడ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ 47 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ఓటమి తర్వాత స్పందించిన కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌పై ప్రశ్నలు లేవనెత్తాడు.

ఓటమి తర్వాత ఆగ్రహంతో రిజ్వాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో రెండో ఓటమి తర్వాత కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. "మేము ఊహించిన దానికంటే ఎక్కువ పరుగుల సాధించారు. బంతి కొంచెం ఆగి వచ్చింది. మేము 50-50 అవకాశాలను లక్ష్యం వైపు మార్చలేకపోయాము. వారు మంచి దూకుడుతో రాణించారు. మేము ఇంకా బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ కోసం చూస్తున్నాం. ప్రారంభంలో ఉన్న సమయంలో బ్యాట్, బంతి రెండింటిలోనూ అంతగా రాణించలేకపోయాం. మెరుగుపడతామని ఆశిస్తున్నాం. ఈ సీజన్ లో ముల్తాన్ సుల్తాన్స్ ఇంకా మంచి సమన్వయంతో కూడా ప్లేయింగ్ ఎలెవన్ ను కనుగొనలేదని.. దాని కారణంగానే ఆ జట్టు ఓడిపోతోంది." అని మహ్మద్ రిజ్వాన్ అభిప్రాయపడ్డాడు.

PSL 2025 Mohammed Rizwan Lashes Out After Second Consecutive Defeat

202 పరుగులు చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన షాదాబ్ ఖాన్ సారథ్యంలోని ఇస్లామాబాద్ యునైటెడ్ 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ తరపున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సాహిబ్జాదా ఫర్హాన్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఈ మ్యాచ్‌లో 53 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇది కాకుండా కాలిన్ మున్రో 25 బంతుల్లో 48 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. జాసన్ హోల్డర్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనలో మహమ్మద్ రిజ్వాన్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ముల్తాన్ సుల్తాన్స్ తరపున కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 38 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇది కాకుండా ఇఫ్టికార్ అహ్మద్ 32 పరుగులు, ఉస్మాన్ ఖాన్ 20 బంతుల్లో 31 పరుగులు సాధించారు. ఇస్లామాబాద్ యునైటెడ్ తరపు బౌలింగ్ చేసిన జాసన్ హోల్డర్ గరిష్టంగా 4 వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన ప్రదర్శనకు జాసన్ హోల్డర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

Story first published: Thursday, April 17, 2025, 11:47 [IST]
Other articles published on Apr 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+