Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PSL: సెంచరీ బాదితే గిఫ్ట్‌గా హెయిర్ డ్రయర్ ఇవ్వడం ఏంట్రా?

IPL VS PSL: ఐపీఎల్‌కు పోటీగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్వహిస్తోన్న పీఎస్ఎల్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఆ దేశపు మాజీ క్రికెటర్లు ఎంతో గొప్పగా చెప్పుకున్న పీఎస్ఎల్ 2025 సీజన్ అంతా తుస్సు మనిపించేలా కనిపిస్తోంది. తాజాగా ఈ పీఎస్ఎల్‌లో ఓ సెంచరీ వీరుడికి.. జట్టు యాజమాన్యం ఇచ్చిన బహుమతి నెట్టింట నవ్వులు పూయించడంతో పాటు చర్చనీయాంశంగా మారింది.

రెండు సెంచరీలు..
పీఎస్ఎల్ లో భాగంగా కరాచీ కింగ్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఇద్దరు వీరులు సెంచరీతో మెరిశారు. ఒకరు ముల్తాన్ సుల్తాన్ కెప్టెన్ రిజ్వాన్ (9 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 63 బంతుల్లో 105) అయితే.. మరొకడు కరాచీ కింగ్స్ జట్టులోని జేమ్స్ విన్స్ (14 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 43 బంతుల్లో 101). అయితే ఈ పోరులో వార్నర్ నేతృత్వంలోని కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. జేమ్స్ విన్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

psl 2025 james vince awarded hair dryer for century in karachi kings vs multan sultan

గిఫ్ట్‌గా హెయిర్ డ్రయర్.. నెక్ట్స్ షాంపు, షేవింగ్ క్రీమ్..
విన్స్ సెంచరీ ప్రదర్శనకు గానూ మోస్ట్ రిలయబుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పేరుతో అతడికి మ
రో అవార్డు కూడా దక్కింది. అదే హెయిర్ డ్రయర్. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు హెయిర్ డ్రయర్ ఇవ్వడం ఏంట్రా అంటూ మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. తర్వాతి మ్యాచులో షాంపును లేదా షేవింగ్ క్రీమ్ లు కూడా ఇస్తారేమో అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. పైగా లీగ్ నిర్వాహకులు స్టేడియంలో లక్కీ గిఫ్ట్ పేరిట ఓ బైక్ ను ప్రదర్శనకు ఉంచారు. దీంతో వచ్చే ఏడాది సైకిల్ ను పెడతారేమో అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు.

Story first published: Monday, April 14, 2025, 12:14 [IST]
Other articles published on Apr 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+