PSL 2025: ప్రారంభ మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌దే విజయం
PSL 2025: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఏప్రిల్ 11(శుక్రవారం)న ప్రారంభమైంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్ జట్లు రావల్పిండి స్టేడియం వేదికగా తలపడ్డాయి. ఈ ప్రారంభ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. లాహోర్ ఖలందర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఇస్లామాబాద్ యునైటెడ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025కు గొప్ప ఆరంభం ఇచ్చింది. జాసన్ హోల్డర్ ప్రాణాంతక బౌలింగ్, కాలిన్ మున్రో విధ్వంసక బ్యాటింగ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 19.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది. లాహోర్ ఖలందర్స్ తరపున అబ్దుల్లా షఫీక్ అత్యధికంగా 66 పరుగులు చేశాడు. ఇస్లామాబాద్ తరపున జాసన్ హోల్డర్ అద్భుతంగా రాణించి 4 వికెట్లు పడగొట్టగా.. షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. నసీమ్ షా, రిలే మెరిడిత్, ఇమాద్ వసీం తలో వికెట్ తీసుకున్నారు.
140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటైడ్.. 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. కాలిన్ మున్రో 59, సల్మాన్ ఆఘా 41 పరుగులతో అజేయంగా నిలవడంతో ఇస్లామాబాద్ అలవోకగా విజయం సాధించింది. లాహోర్ ఓటమికి వారి దిశానిర్దేశం లేని బౌలింగ్ కూడా కారణం. లాహోర్ బౌలర్లు 14 అదనపు పరుగులు సమర్పించుకున్నారు. దీనిని ఇస్లామాబాద్ బ్యాటర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఇందులో 12 వైడ్ బాల్స్ ఉన్నాయి. లాహోర్ జట్టు మ్యాచ్ ప్రారంభం నుంచే దారుణంగా ఆడింది. పవర్ ప్లేలోనే జట్టు ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. అనంతరం అబ్దుల్లా షఫీక్ బాధ్యతలు స్వీకరించాడు. కానీ చివరి వరకు అతనికి సపోర్టు ఇచ్చే వారు దొరకలేదు.

దడ పుట్టించిన జాసన్ హోల్డర్
ఇస్లామాబాద్ తరపున జాసన్ హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 26 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనకు గానూ జాసన్ హోల్డర్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా కూడా ఎంపికయ్యాడు. హోల్డర్ తో పాటు కెప్టెన్ షాదాబ్ ఖాన్ కూడా 3.2 ఓవర్లలో 25 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా.. ఇమాద్ వసీం 4 ఓవర్లలో కేవలం 21 పరుగులకు ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications