Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PSL 2025: కాలినో మున్రో X ఇఫ్తికార్ అహ్మద్ డిష్యూం డిష్యూం(వీడియో)

PSL 2025: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా మంగళవారం రాత్రి ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఇస్లామాబాద్ యునైటెడ్ బ్యాటర్ కాలినో మున్రో ఇఫ్తికార్ అహ్మ‌ద్‌ను చక్కింగ్ చేశాడని ఆరోపించినప్పుడు మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో అంపైర్‌తో పాటు ముల్తాన్ సుల్తాన్స్ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐసీసీ నిబంధనల ప్రకారం.. బౌలర్ తన చేతిని సరిగ్గా తిప్పకుండా బంతిని నేరుగా విసిరేయడాన్ని చక్కింగ్ అని అంటారు. ఇస్లామాబాద్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో కాలిన్ మున్రోకు యార్కర్ వేసిన తర్వాత ఇఫ్తికార్ అహ్మద్ వైపు చేయిని చూపించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇది ఇఫ్తికార్ అహ్మద్, కెప్టెన్ రిజ్వాన్‌లకు కోపం తెప్పించింది. వారు మున్రోతో వాదించడం ప్రారంభించారు. ఆటగాళ్లు వాగ్వాదానికి దిగిన చాలా సేపటి తర్వాత ఆన్-ఫీల్డ్ అంపైర్ రంగంలోకి దిగి వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు.

PSL 2025 Colin Munro vs Iftikhar Ahmed Clash Goes Viral Heated Argument on the Field

మున్రో క్యాచ్ పట్టిన ఇఫ్తికార్ అహ్మద్
ఈ సంఘటన జరిగినప్పుడు మున్రో 23 బంతుల్లో 40 పరుగులు చేసి ఆడుతున్నాడు. ఈ సంఘటన తర్వాత కాలిన్ మున్రో తన ఇన్నింగ్స్ ను కొనసాగించలేకపోయాడు. మున్రో 28 బంతుల్లో 45 పరుగులు చేసి అనంతరం ఔట్ అయ్యాడు. కాలిన్ మున్రో ఇఫ్తికార్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ ఆఫ్ స్పిన్నర్ తన రెండు ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి వికెట్ తీసుకోలేకపోయాడు.

మేము 15-20 పరుగులు వెనుకబడ్డాం-రిజ్వాన్
మ్యాచ్ తర్వాత ముల్తాన్ సుల్తాన్స్ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తన జట్టు బ్యాటింగ్ విషయంలో బలహీనంగా ఉందని అంగీకరించాడు. తాము 15-20 పరుగులు వెనకబడి ఉన్నామని చెప్పాడు. 180+ స్కోరు సురక్షితమని తాము అనుకున్నామని.. కానీ అది జరగలేదన్నాడు. ఓడిపోయినప్పుడు ఎప్పుడూ ఒత్తిడి ఉంటుందని.. భవిష్యత్తులో మెరుగుపడుతామని ఆశిస్తున్నామన్నారు. జట్టు గురించి మాట్లాడుకుంటే పాయింట్ల పట్టికలో ఇది అత్యంత చెత్త జట్టుగా మిగిలిపోయింది. ముల్తాన్ సుల్తాన్స్ జట్టు 5 మ్యాచ్‌లలో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది.

Story first published: Thursday, April 24, 2025, 12:26 [IST]
Other articles published on Apr 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+