Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PSL 2022: పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ విజేత‌గా లాహోర్ ఖలందర్స్.. ఫైన‌ల్లో ముల్తాన్ సుల్తాన్స్ చిత్తు

PSL 2022: Pakistan Super League winner Lahore Qalandars.. Beat Multan Sultans in final

పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ 2022 విజేత‌గా లాహోర్ ఖలందర్స్ నిలిచింది. ఫైన‌ల్‌లో ఆ జ‌ట్టు ముల్తాన్ సుల్తాన్స్‌పై విజ‌యం సాధించంది. సుల్తాన్‌పై 42 ప‌రుగుల తేడాతో గెలిచి తొలి సారి ట్రోఫిని ముద్దాడింది. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన మ‌హ్మ‌ద్ అఫీజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఫైన‌ల్ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 180 ప‌రుగులు చేసింది. 25 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లోప‌డిన లాహోర్‌ను మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ అద్బుత హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు.

మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న హ‌ఫీజ్ 9 ఫోర్లు, ఒక సిక్సుతో 69 ప‌రుగులు చేశాడు. చివ‌ర్లో హ్యారీ బ్రూక్, వైస్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. 22 బంతుల్లోనే 41 ప‌రుగుల‌తో హ్యారీ, 8 బంతుల్లోనే 28 ప‌రుగుల‌తో వైస్ నాటౌట్‌గా నిలిచారు. వీరిద్ద‌రు చివ‌రి వికెట్‌కు 16 బంతుల్లోనే 43 ప‌రుగులు జోడించారు. సుల్తాన్స్ బౌల‌ర్ల‌లో అసిఫ్ ఆఫ్రిదీ 3, విల్లీ, ద‌హ‌నీ త‌లో వికెట్ తీశారు.

అనంత‌రం 181 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌తో బ‌రిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్ 19.3 ఓవ‌ర్ల‌లో 138 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో లాహోర్ ఖ‌లంద‌ర్స్ చేతిలో ముల్తాన్ సుల్తాన్స్ చిత్తుగా ఓడింది. ఆ జ‌ట్టు ఏ ద‌శ‌లోనూ ల‌క్ష్యాన్ని చేధించేలా క‌నిపించ‌లేదు. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో ఖుష్దిల్ షా (32), టిమ్ డేవిడ్ (27) మాత్రమే చెప్పుకోద‌గ్గ ప‌రుగులు చేశారు.

మిగతా వారిలో ఓపెన‌ర్ షాన్ మసూద్ 19, కెప్టెన్ మహ్మ‌ద్ రిజ్వాన్ 14 ప‌రుగులు చేశారు. రిలీ రోసోవ్ 15, ఇమ్రాన్ తాహీర్ 10 ప‌రుగులు చేశారు. రమ్మన్ రయీస్, అమీర్ అజ్మత్ 6 పరుగుల చొప్పున చేశారు. లాహోర్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ షాహిన్ ఆఫ్రీదీ 3 వికెట్లతో స‌త్తా చాటాడు. మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్, జ‌మార్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు. డేవిడ్ విజ్, హ‌రీస్ ర‌ఫ్ త‌లో వికెట్ తీశారు.

Story first published: Monday, February 28, 2022, 14:04 [IST]
Other articles published on Feb 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+