న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PSL 2022: క్యాచ్ వదిలేశాడని గ్రౌండ్‌లోనే ఫీల్డర్ చెంప ప‌గ‌ల‌గొట్టిన పాకిస్థాన్ బౌల‌ర్.. వీడియో వైర‌ల్‌

PSL 2022: Haris Rauf slaps Kamran Ghulam on the ground for missing a catch

పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో సంచ‌ల‌న‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. క్యాచ్ వ‌దిలేశాడ‌ని గ్రౌండ్‌లోనే ఫీల్డ‌ర్ చెంప ప‌గ‌లగొట్టాడు బౌల‌ర్‌. దీంతో స‌ద‌రు బౌల‌ర్ తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అత‌డిపై క‌ఠిన చర్య‌లు తీసుకోవాల‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నెట్టిజ‌న్లు సైతం అతడి చ‌ర్య‌ను తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అయితే ఇదే మ్యాచ్‌ చివ‌ర్లో ఓ ర‌నౌట్ సంద‌ర్భంగా స‌ద‌రు బౌల‌ర్, స‌ద‌రు ఫీల్డ‌ర్‌ను కౌగిలించుకోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

చెంప ప‌గ‌ల‌గొట్టాడు

అసలు ఏం జ‌రిగిందంటే పీఎస్ఎల్‌లో భాగంగా లాహోర్ ఖ‌లంద‌ర్స్‌, పెషావ‌ర్ జ‌ల్మీ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. లాహోర్ ఖ‌లంద‌ర్స్ బౌల‌ర్ హారిస్ రౌఫ్ రెండో ఓవ‌ర్ వేశాడు. 1.2వ ఓవ‌ర్‌లో పెషావ‌ర్ జ‌ల్మీ బ్యాట‌ర్‌ హ‌జ్ర‌తుల్లా బ‌జాయ్ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి బంతిని గాలిలోకి లేపాడు. బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న క‌మ్రాన్ గులామ్ చేతిలో బంతి ప‌డ‌గా, పొర‌పాటున అత‌ను ఆ క్యాచ్‌ను నెల‌పాలు చేశాడు. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి లోనైన బౌల‌ర్ హారిస్ రౌఫ్.. వెంట‌నే క‌మ్రాన్ గులామ్ చెంప ప‌గ‌ల‌కొట్టాడు. దీంతో హారిఫ్ రౌఫ్ తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ్యాచ్ ఉత్కంఠ‌గా కూడా జ‌ర‌గ‌డం లేదని ఆరంభంలోనే ఇలా చేయ‌డమేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో హారిస్ రౌఫ్ వివాదంలో చిక్కుకున్నాడు. కాగా ఇక్క‌డ బౌల‌ర్ హారిస్ రౌఫ్.. ఫీల్డ‌ర్‌ క‌మ్రాన్ గులామ్ ఇద్ద‌రు కూడా పాకిస్థాన్ ఆట‌గాళ్లే కావ‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ సూపర్ లీగ్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ర‌నౌట్.. కౌగిలింత‌

అయితే అదే ఓవ‌ర్‌లో ఐదో బంతికి మ‌రో ఓపెన‌ర్ మ‌హ్మ‌ద్ హ్యారిస్ ఔట‌య్యాడు. భారీ షాట్‌కు ప్ర‌యత్నించి ఫీల్డ‌ర్ ఫ‌వాద్ అహ్మ‌ద్ చేతికి చిక్కాడు. కాగా అదే మ్యాచ్ 17వ ఓవ‌ర్లోని నాలుగో బంతికి రియాజ్‌(1)ని క‌మ్రాన్ గులామ్ త‌న అద్భుత ఫీల్డింగ్‌తో ర‌నౌట్ చేశాడు. దీంతో అంత‌కు ముందు చెంప‌దెబ్బ కొట్టిన హారిస్ రౌఫ్ అత‌ని ద‌గ్గ‌రికి వెళ్లి అభినందించాడు. ఈ క్ర‌మంలో అత‌డిని కౌగిలించుకున్నాడు.

నెటిజ‌న్స్ సిరీయ‌స్‌

హరీస్ రవూఫ్‌కు ఫీల్డ్‌లో ప్ర‌వ‌ర్తించిన తీరుపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. క్రికెట్ అనేది పెద్దమనుషుల ఆట అని, మైదానంలో అభిమానులు ఆశించే ప్రవర్తన ఇది కాద‌ని హరీస్ రవూఫ్‌కు బుద్ది చెబుతున్నారు. "వాట్ నాన్సెన్స్!! ఆ కౌగిలింత అతను చేసిన దానికి పరిహారం ఇవ్వదు, అతనికి భారీగా జరిమానా విధించాలి, ఇది ఆమోదయోగ్యం కాని ప్రవర్తన" అని మ‌రికొంత మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. క్యాచ్‌ను వ‌దిలేసినంద‌కు అత‌డిని మందిలిస్తే అయిపోయే దానికి కొట్ట‌డం ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. విచార‌ణ చేసి ర‌వూఫ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. అదే స‌మ‌యంలో కొంత మంది హ‌రీస్ ర‌వూఫ్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. మరికొంత మంది వెస్టిండీస్‌తో భార‌త్ ఆడిన టీ20 మ్యాచ్‌లోని చాహ‌ల్, ర‌వి బిష్ణోయ్ క‌లిసి ఉన్న‌ ఫోటోను షేర్ చేసి భార‌త ఆట‌గాళ్లకు, పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌కు ఉన్న తేడా ఇదేన‌ని రాసుకొస్తున్నారు.

PSL 2021 Final Highlights | Multan Sultans | Oneindia Telugu

సూప‌ర్ ఓవ‌ర్‌లో ఫ‌లితం

కాగా లాహోర్ ఖ‌లంద‌ర్స్‌, పెషావ‌ర్ జ‌ల్మీ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఈ మ్యాచ్ టైగా ముగిసింది. స్కోర్లు: పెషావ‌ర్ జ‌ల్మీ 158-7, లాహోర్ ఖ‌లంద‌ర్స్ 158-8. అయితే సూప‌ర్ ఓవ‌ర్‌లో పెషావ‌ర్ జ‌ల్మీ గెలిచింది. మొద‌టి బ్యాటింగ్ చేసిన లాహోర్ 5 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గా.. పెషావ‌ర్ జ‌ల్మీ 8 ప‌రుగులు చేసి విజ‌యం సాధించింది.

Story first published: Tuesday, February 22, 2022, 18:20 [IST]
Other articles published on Feb 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X