Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాల్ పట్టుకోకుండా.. బ్యాట్స్‌మన్‌ కాళ్లు పట్టుకున్న కీపర్ (వీడియో)

PSL 2020: Keeper Chadwick Walton hilariously grabs Ben Dunk’s legs
Wicket-Keeper Walton Hilariously Grabs Batsman Ben Dunks Legs In PSL | Oneindia Telugu

లాహోర్‌: క్రికెట్ ఆటలో ఎప్పుడూ ఎదో సరదా ఘటన జరగడం సహజమే. ఎక్కువగా బౌలర్, బ్యాట్స్‌మన్‌లు ఈ సరదా ఘటనలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. బౌలర్ వికెట్ తీసే క్రమంలో, బ్యాట్స్‌మన్‌ పరుగులు చేసే క్రమంలో సరదా ఘటనలు జరుగుతుంటాయి. అయితే ఈసారి తానేం తక్కువ కాదంటూ ఓ కీపర్ తెరపైకి వచ్చాడు. సదరు కీపర్ బంతిని వదిలేసి బ్యాట్స్‌మన్‌ కాళ్లను పట్టుకున్నాడు. అయితే ఆ కీపర్ తొందరపాటులో చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయంలోకి వెళితే...

తడబడ్డ కీపర్:

తడబడ్డ కీపర్:

ప్రస్తుతం పాక్ గడ్డపై పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)జరుగుతున్న విషయం తెలిసిందే. లీగ్‌లో భాగంగా లాహోర్‌ క్వాలండర్స్‌-కరాచీ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. లాహోర్‌ జట్టు ఛేజింగ్‌ చేస్తోంది. కరాచీ కింగ్స్‌ బౌలర్ డెల్‌ పోర్ట్‌ వేసిన 10 ఓవర్‌ ఐదో బంతిని బ్యాట్స్‌మన్‌ బెన్‌ డంక్‌ రివర్స్‌ స్వీప్‌ ఆడాడు. బంతి కాస్తా ఎడ్జ్‌ తీసుకుని అక్కడే పైకి లేచింది. అయితే కరాచీ వికెట్‌ కీపర్‌ చాడ్విక్‌ వాల్టన్‌ బంతిని అందుకోవడంలో తడబడ్డాడు.

బ్యాట్స్‌మన్‌ కాళ్లు పట్టుకున్న చాడ్విక్‌:

బ్యాట్స్‌మన్‌ కాళ్లు పట్టుకున్న చాడ్విక్‌:

బ్యాట్స్‌మన్‌ డంక్‌ కొట్టిన బంతి అతని పైనే లేచింది. ఆ బంతి డంక్‌ భుజానికి తాకి గ్రౌండ్‌ను తాకే సమయంలో ఎక్కడుందో కీపర్‌ చాడ్విక్‌కు కనబడలేదు. దాంతో డంక్‌ కాళ్లను చాడ్విక్‌ అమాంతం పట్టేసాడు. అయితే బంతి డంక్‌ హెల్మెట్‌లో చిక్కుకుని.. కాసేపు ఆగి అక్కడి నుండి కీపర్ తలపై పడింది. అప్పటికి కూడా డంక్‌ కాళ్లను చాడ్విక్‌ పట్టుకునే ఉన్నాడు. ఇక కామెంటేటర్ ఇది ఒక ఫన్నీ సన్నివేశంగా వర్ణించాడు. ఆపై కీపర్, బ్యాట్స్‌మన్‌ ఇద్దరూ నవ్వుకున్నారు. ఏదేమైనా క్యాచ్‌ వదిలేసి ఇలా కాళ్లను చుట్టేయడం మాత్రం ఫన్నీగా ఉంది.

కీపింగ్‌ చేయకుండా కాళ్లు మొక్కుతావేంట్రా:

ఈ క్యాచ్‌కు సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు నవ్వులు పూయిస్తూ.. తమదైన స్టయిల్లో కెమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఇది కేవలం పీఎస్‌ఎల్‌లో మాత్రమే జరుగుతుంది' అని ఓ నెటిజన్ ఎద్దేవా చేయగా.. 'కీపింగ్‌ చేయకుండా కాళ్లు మొక్కుతావేంట్రా నాయనా' అని మరో నెటిజన్ జోకు పేల్చాడు. అయితే ఈ వీడియో కొద్ది గంటల్లోనే అనేక లైకులు సంపాదించింది.

బెన్‌ డంక్‌ వీరబాదుడు:

బెన్‌ డంక్‌ వీరబాదుడు:

తొలుత బ్యాటింగ్‌ చేసిన కరాచీ కింగ్స్ ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. బాబర్ అజామ్ (38), అలెక్స్ హేల్స్ (80), చాడ్విక్‌ వాల్టన్‌ (45) రాణించారు. మాజ్ ఖాన్ రెండు వికెట్లు తీసాడు. లక్ష్య చేధనలో బెన్‌ డంక్‌ చెలరేగడంతో లాహోర్‌ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్యాచ్ జారవిడిచే సమయానికి బెన్‌ డంక్‌ 10 పరుగుల వద్ద ఉండగా.. ఆపై వీరబాదుడు బాదాడు. 40 బంతుల్లో 12 సిక్స్‌లు, 3 ఫోర్లతో అజేయంగా 99 పరుగులు చేసాడు.

Story first published: Monday, March 9, 2020, 15:26 [IST]
Other articles published on Mar 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+