Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీఎస్ఎల్ 2018: బౌండరీ లైన్ వద్ద అద్భుతం చేసిన అఫ్రిది (వీడియో)

PSL 2018: Twitter In Disbelief After Shahid Afridi Takes A Blinder

హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ షాహిది అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు రెండేళ్లు పూర్తి అయింది. అయినా సరే తనలో సత్తా తగ్గలేదని పలుమార్లు నిరూపించుకున్నాడు. ఇటీవలే స్విట్జర్లాండ్‌లో జరిగిన ఐస్ క్రికెట్‌లో కూడా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్‌ జట్టుపై అఫ్రిది నేతృత్వంలోని జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

రెండు రోజుల క్రితం ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్‌(పీఎస్‌ఎల్‌) మూడో సీజన్‌లో కరాచీ కింగ్స్‌ తరపున ఆడుతున్న అఫ్రిది కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. దుబాయ్‌ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్రిది ఫీల్డింగ్‌లో మ్యాజిక్ చేసి చూపించాడు.

150 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన క్వెట్టా గ్లాడియేటర్స్ 70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులో ఉన్న అమిన్‌ దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో కరాచీ కింగ్స్ బౌలర్ ఇర్ఫాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ను ఆడేందుకు అమిన్‌ బంతిని గాల్లోకి కొట్టాడు.

అదే సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఉన్న ఆఫ్రిది పరిగెత్తుకుంటూ వెళ్లి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే బౌండరీ లైన్ వద్ద కావడంతో ఊపు ఆపుకోలేక బౌండరీలైన్‌ దాటే సమయంలో బంతిని మైదానంలోకి విసిరాడు. మళ్లీ అంతే వేగంగా తిరిగొచ్చి బంతిని ఒడిసి పట్టుకున్నాడు.

ఈ క్యాచ్‌తో స్టేడియంలోని అభిమానులు అఫ్రిదిని తమ కరతాళ ధ్వనులతో అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Saturday, February 24, 2018, 12:53 [IST]
Other articles published on Feb 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+