పీఎస్ఎల్‌లో కోహ్లీ కూడా ఆడాలి: స్టేడియంలో అభిమాని

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభిమానులు కోకొల్లలు. అతని ఖ్యాతి ప్రపంచమంతటా వ్యాపించింది. ఇటీవలే ప్రారంభమై పాకిస్థాన్‌కు సొమ్ములు కురిపిస్తోన్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో సైతం కోహ్లీ పేరు వినబడుతోంది. పీఎస్ఎల్‌లో భాగంగానే ఇస్లామాబాద్ జట్టుకు యునైటెడ్ క్విట్టా గ్లాడియేటర్స్‌కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ మధ్యలో కోహ్లీ అభిమాని ప్లకార్డును చూపిస్తూ కోహ్లీ పీఎస్ఎల్‌లో ఆడాలంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు.

ప్లకార్డులతో ప్రదర్శన:
మ్యాచ్ జరిగే సమయంలో ‘పీఎస్‌ఎల్‌లో కోహ్లీని చూడాలనుకుంటున్నాం' అని అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పీఎస్‌ఎల్-3లో మ్యాచ్‌లు ప్రస్తుతం యూఏఈలో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకాదరణ లేక స్టేడియాలు వెలవెలపోతున్న ఫొటోలు గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

25ఏళ్ల చరిత్ర పునరావృతం:
శ్రీలంకతో వరుస సిరీస్‌ల అనంతరం విజయోత్సాహంతో దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది టీమిండియా. ఈ పర్యటనలోనూ రెండు సిరీస్‌ల విజయాన్ని కైవసం చేసుకున్న జట్టుకు నాయకుడిగా వ్యవహరించిన కెప్టెన్ కోహ్లీకే ఆ ఘనత దక్కతుంది.

కోహ్లీకి ప్రస్తుతం విరామం:
సఫారీ పర్యటనను విజయవంతగా ముగించుకుని వచ్చిన కోహ్లీ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నాడు. శ్రీలంక-భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అందాయి. ఈ నెల 6 నుంచి టీ20 టోర్నీ ప్రారంభంకానుంది.

ఐపీఎల్‌లోనూ అంతే ఘనత:
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కోహ్లీని అంటిపెట్టుకుని అతనిని రూ.17కోట్లకు కొనుగోలు చేసింది. 2016 జాబితా వరకు ఐపీఎల్ లీగ్‌లో 10మ్యాచ్‌లు ఆడిన విరాట్ 973 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2013 నుంచి అతను రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications