Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దక్షిణాఫ్రికా పర్యటనకు హైదరబాదీ ఫేస్ బౌలర్: సఫారీలో సిరాజ్

Proud That I Can Shoulder Family's Responsibility: Siraj

హైదరాబాద్ : హైదరాబాద్ యువ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లనున్నాడు. ఇందుకు సంబంధించిన నిర్ణయాలను బీసీసీఐ తీసుకుంది. ఈ పర్యటన నిమిత్తం సిరాజ్, ఆవేశ్ ఖాన్, నవ్‌దీప్ షైనీ, బాసిల్ థంపీ సిద్ధమయ్యారు. సఫారీ పర్యటనలో టీమిండియాకు నెట్స్‌లో బౌలింగ్ చేసేందుకు ఈ యువ బౌలర్లు వెళ్లనున్నారు.

2017 అక్టోబరులో సిరాజ్‌ను ఇండియన్ క్రికెట్ టీం తన జట్టులోకి చేర్చుకుంది. 2017 ఐపీఎల్ సీజన్‌కు గాను సిరాజ్‌ను హైదరాబాద్ సన్‌రైజర్స్ టీం 2.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అతని తండ్రి ఆటో డ్రైవర్. అప్పట్లో క్రికెట్ టీంలో సెలక్టైనందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో తను ఆ డబ్బుతో ఇల్లు కొనుక్కోవాలని చెప్పిన సంగతి తెలిసిందే.

దక్షిణాఫ్రికా టూర్ :

టీమ్ మేనేజ్‌మెంట్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నలుగుర్ని బీసీసీఐ ఎంపిక చేసింది. మరోవైపు దక్షిణాఫ్రికాలో ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండానే భారత్ బరిలోకి దిగనుంది. ఏం పథకం వేసిందో బీసీసీఐ ప్రాక్టీస్ లేకుండానే అక్కడ వన్డే మ్యాచ్‌కు సిద్ధమంటుంది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. ఇక అక్కడ జరిగే డేనైట్ మ్యాచ్‌లు అరగంట ముందుగానే ఆరంభం కానున్నాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 12, 2017, 17:18 [IST]
Other articles published on Dec 12, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+