ఓడినా మనసులు గెలిచారు: మిథాలీ సేనపై ప్రశంసల వెల్లువ
హైదరాబాద్: భారత మహిళా జట్టుకు ఓ సువర్ణావకాశం చేజారింది. అసాధారణ ప్రదర్శనతో టోర్నీ మొత్తం అలరించిన మిథాలీ సేన ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో కప్పు చిక్కినట్లే చిక్కి చేజారింది. విజయం అంచుల వరకూ వెళ్లిన మిథాలీసేన చివరకు రన్నరప్‌గా నిలిచింది.
43 ఓవర్ల వరకు గెలుపు భారత్ వైపే ఉంది. అప్పుడు భారత్ స్కోరు 191/3. భారత్ విజయానికి చేయాల్సింది ఇంకా 38 పరుగులే. అప్పటికే పూనమ్ రౌత్ క్రీజులో పాతుకుపోయింది. మరోవైపు వేద కృష్ణమూర్తి దూకుడుగా ఆడుతోంది. ఇద్దరూ అలవోకగా బ్యాటింగ్ చేస్తుంటే విజయం భారత్‌దేనని అందరూ భావించారు.
ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ బౌలర్ ష్రబ్‌సోల్ విజృంభించడంతో 28 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి మిథాలీసేన ఓటమి పాలైంది. అయితే ఫైనల్లో మిథాలీసేన ఓటమి పాలైనప్పటికీ, వారి పోరాట పటిమ కోట్లాది భారతీయుల మనసులు గెలిచింది. దీంతో మిథాలీ సేన పై ప్రశంసల జల్లు కురిస్తోంది.
ప్రధాని మోడీ నుంచి మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం మిథాలీ సేనపై ప్రశంసల వర్షం కురిపించారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు మిథాలీ సేన పోరాట పటిమ గర్వించేలా ఉందని పొగడ్తలతో ముంచెత్తారు. వారి పోరాట పటిమను ప్రశంసిస్తున్నారు.
ప్రధాని మోడీ
మహిళా క్రికెటర్లు సాయశక్తుల పోరాడారు. టోర్నీ ఆసాంతం వారు గొప్ప పట్టుదలను నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ జట్టును చూసి గర్విస్తున్నా
సచిన్ టెండూల్కర్
భారత మహిళలు మా మనసులను గెలిచారు.. ఉమెన్ ఇన్ బ్లూ ప్రదర్శన అద్భుతం కానీ ఒక్కోసారి ఇలాంటివి తప్పవు
యువరాజ్ సింగ్
మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. టోర్నీలో ఇక్కడి వరకు వచ్చినందుకు మీ అందరినీ చూసి గర్విస్తున్నాం. కంగ్రాట్స్ ఇంగ్లాండ్
వీరేంద్ర సెహ్వాగ్
భారత మహిళలను చూసి గర్విస్తున్నా.. ఈ రోజు కలిసిరాలేదు. . ఐతే భారత్‌లో మహిళలకు ఆదరణ పెరిగిందనడంలో సందేహం లేదు. అమ్మాయిలు మీ పోరాట స్పూర్తికి వందనాలు.
గౌతమ్ గంభీర్
మీరు మాకు నమ్మకాన్ని కలిగించారు. కలలు కనేలా చేశారు. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం. మీ ఆటను చూడటాన్ని గౌరవంగా భావిస్తున్నా
రోహిత్ శర్మ
టోర్నీ ఆసాంతం గొప్ప ప్రదర్శన కనబర్చారు. ఓడినా మిలియన్ అభిమానుల మనసులను గెలిచారు. మీ ప్రదర్శన క్రీడా స్పూర్తిని కలిగించింది.
అమితాబ్ బచ్చన్
మీరు ఓడేంతవరకు గెలుస్తారనే నమ్మకాన్ని కలిగించారు. మహిళలు అద్భుతంగా ఆడారు. భారతీయ నారీ జిందాబాద్
షారుక్ ఖాన్
దేశం మొత్తం గర్వించే ప్రదర్శన కనబర్చారు. మీరు గొప్ప మైలు రాయి సాధించారు.
అక్షయ్ కుమార్
పగిలిన హృదయాలు కూడా నవ్వుతాయి. వీరు ఉమెన్ క్రికెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. చాలా గర్వంగా ఉంది.
కేఎల్ రాహుల్
దేశం మొత్తం గర్వించే ప్రదర్శన చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications