Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అండర్-19 వరల్డ్ కప్: నేరుగా ట్రోఫీని ద్రవిడ్ చేతుల్లో పెట్టి గౌరవించిన షా

Under-19 World Cup : India Lift record fourth U-19 World Cup title

హైదరాబాద్: అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఓటమి అనేదే లేకుండా వరుస విజయాలతో వరల్డ్ కప్‌ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి నాలుగోసారి వరల్డ్ కప్ నెగ్గిన జట్టుగా చరిత్ర సృష్టించింది.

 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం

8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం

టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఇదే ఆస్ట్రేలియాపై వంద ప‌రుగుల‌తో గెలిచిన టీమిండియా ఫైన‌ల్లో కూడా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో ఆసీస్‌తో మొదలుకుని ప‌పువా న్యూ గినియా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ ఆ తర్వాత ఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన ఆటతీరు కనబర్చింది. తాజా విజయంతో యావత్ భారతావని పొంగిపోతోంది. సోషల్ మీడియా వేదికగా యువ భారత్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 ఈ విజయం వెనుక 14 నెలల కష్టం

ఈ విజయం వెనుక 14 నెలల కష్టం

అయితే ఈ విజయం ఒక్క రోజులో సొంతమైంది కాదు. దీని వెనుక 14 నెలలు కష్టం ఉంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ శిక్షణ, కుర్రాళ్ల అంకిత భావం కలగలిపి ఫైనల్లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. యువ ఆటగాళ్లను ప్రోత్సహించండలో ఎప్పుడూ ముందుండే రాహుల్ ద్రవిడ్ అండర్-19 కోచ్‌గా తన అనుభవాన్ని, ఆట పట్ల అంకితభావాన్ని కుర్రాళ్లకు పాఠాలు నేర్పాడు. దూకుడుగా ఆడమంటూనే ఉన్నత క్రికెట్ విలువలు నేర్పాడు.

 ద్రవిడ్ క్రమశిక్షణ, ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం

ద్రవిడ్ క్రమశిక్షణ, ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం

ద్రవిడ్ క్రమశిక్షణతో పాటు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం ఫైనల్లో భారత్ విజయం సాధించడంలో దోహదపడ్డాయి. నాలుగోసారి వరల్డ్ కప్‌ను గెలిచింది కుర్రాళ్లైనా, గెలిపించింది మాత్రం రాహుల్ ద్రవిడే. ఈ విషయం క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ అవగతం అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాడిగా ఎంత అకింత భావంతో జట్టుకు విజయాలు అందించాడో అంతకు మించిన అంకిత భావంతో కుర్రాళ్లను ద్రవిడ్ మార్గనిర్దేశం చేస్తున్నాడు.

 యువ ఆటగాళ్లకే మార్గనిర్దేశం

యువ ఆటగాళ్లకే మార్గనిర్దేశం

సీనియర్ జట్టుకు కోచ్‌గా ఉండమని బోర్డు కోరినప్పటికీ ఆ ప్రతిపాదనను సున్నతంగా తిరస్కరించాడు. యువ ఆటగాళ్లకే మార్గనిర్దేశం చేస్తానంటూ ఇండియా-ఏ, అండర్-19 జట్టు కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. జట్టులోని ఆటగాళ్లకు క్రమశిక్షణ నేర్పాడు. ఆటలో పట్టు వదలొద్దంటూ పాఠాలు నేర్పాడు.

 ద్రవిడ్ మార్గదర్శకత్వంలోనే కప్ గెలిచాం

ద్రవిడ్ మార్గదర్శకత్వంలోనే కప్ గెలిచాం

మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ద్రవిడ్ మార్గదర్శకత్వంలోనే మేం కప్ గెలిచామని పృథ్వీ షా చెప్పాడు. అంతేకాదు విజయానంతరం వరల్డ్ కప్‌ ట్రోఫీని అందుకున్న షా... ట్రోఫీని నేరుగా తీసుకెళ్లి తమ ప్రియతమ గురువు చేతిలో పెట్టాడు. దీనిని చూసిన క్రికెట్ అభిమానులు సైతం ఎంతో సంతోషానికి లోనయ్యారు.

అండర్-19 జట్టుకు బీసీసీఐ భారీ నజరానా

మరోవైపు అండర్-19 వరల్డ్ కప్‌ సాధించిన భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, ఒక్కో జట్టు సభ్యుడికి రూ. 30 లక్షలు, ఇక సపోర్టింగ్ స్టాఫ్‌కు రూ. 20 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించింది.

Story first published: Saturday, February 3, 2018, 16:18 [IST]
Other articles published on Feb 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+