Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షకీబ్‌పై నిషేధం ఎఫెక్ట్: ఐసీసీకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో పెల్లుబికిన నిరసనలు

IND vs BAN : Demonstrations On Bangladesh Streets Over Shakib's Suspension || Oneindia Telugu
Protests in Bangladesh over ban on cricket hero Shakib Al Hasan

హైదరాబాద్: ఓ బుకీ తనను సంప్రదించిన విషయాన్ని షకీబ్‌ ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు తెలపకపోవడంతో అతడిపై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది.

ఇందులో ఏడాది సస్పెన్షన్‌ తర్వాత క్రికెట్‌ ఆడొచ్చని వెల్లడించింది. 2017 బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌) సందర్భంగా నవంబర్‌లో తొలిసారి భారత బుకీ దీపక్ అగర్వాల్ షకీబ్‌ను సంప్రదించగా ఆ తర్వాత 2018 జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో ఐపీఎల్లో మరోసారి సంప్రదించాడు. ఈ విషయాలను షకీబ్ ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు చెప్పలేదు.

ఐసీసీ విచారణలో

ఐసీసీ విచారణలో

అయితే, ఐసీసీ విచారణలో యాంటీ కరప్షన్ కోడ్‌లోని మూడు చార్జ్‌లను ఉల్లంఘించినట్లు షకీబ్ దర్యాప్తు అధికారుల ముందు అంగీకరించడంతో మంగళవారం షకీబ్‌కు శిక్షను ఖరారు చేసింది. దీంతో షకీబ్‌ వచ్చే ఐపీఎల్‌తో పాటు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. షకీబ్‌పై నిషేధం బంగ్లాదేశ్‌లో చిచ్చు రేపింది.

నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలంటూ

నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలంటూ

అతడిపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. షకీబ్ సొంత గ్రామం మగురాలో దాదాపు 700 మంది అభిమానులు రాస్తారోకో చేపట్టారు. "షకీబ్‌పై విధించిన నిషేధం ఎత్తివేయాలంటూ నిరసనకారులు హైవేపై ర్యాలీ నిర్వహించారు" అని పోలీస్ ఛీప్ సైఫుల్ ఇస్లామ్ తెలిపారు.

ఐసీసీకి వ్యతిరేకంగా నినాదాలు

ఐసీసీకి వ్యతిరేకంగా నినాదాలు

ఐసీసీకి వ్యతిరేకంగా వాళ్లు నినాదాలు చేశారు. షకీబ్‌పై కుట్ర చేసి నిషేధం విధించారని నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు దేశ రాజధాని ఢాకాలోనూ షకీబ్ అల్ హాసన్ అభిమానులు పెద్దఎత్తున రొడ్లపైకి వచ్చారు. కాగా, షకీబ్‌పై ఐసీసీ విధించిన వెంటనే అమల్లోకి వచ్చింది. దీంతో భారత పర్యటనకు దూరమయ్యాడు.

అక్టోబర్ 29, 2020తో ముగియనున్న నిషేధం

అక్టోబర్ 29, 2020తో ముగియనున్న నిషేధం

షకీబ్‌పై విధించిన నిషేధం అక్టోబర్ 29, 2020తో ముగియనుంది. మరోవైపు నిషేధం ఎదురుకుంటున్న షకీబ్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అండగా నిలిచారు. ఆమె మాట్లాడుతూ "షకీబుల్‌ పొరపాటు చేశాడు. ఆ విషయాన్ని కూడా ఒప్పుకున్నాడు. ఐసీసీ నిర్ణయంపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం, క్రికెట్‌ బోర్డు ఏమి చేయలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. షకీబుల్‌ నిరాశ చెందకూడదు. ఇలాంటి సమయంలో షకీబుల్‌కు అండగా నిలవాలని బంగ్లా క్రికెట్‌ బోర్డుకు సూచిస్తున్నా" అని పేర్కొన్నారు.

Story first published: Wednesday, October 30, 2019, 20:23 [IST]
Other articles published on Oct 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+