న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాల్ టాంపరింగ్: ఆస్ట్రేలియాపై స్లెడ్జింగ్‌కు దిగే ఆలోచన లేదన్న డుప్లెసిస్

Proteas wont use ball-tampering scandal to sledge - Faf du Plessis

హైదరాబాద్: సఫారీ గడ్డపై ఆస్ట్రేలియా క్రికెటర్లు సృష్టించిన బాల్ టాంపరింగ్ ఉదంతం ఆ దేశ ప్రతిష్టను మసకబారేలా చేసింది. ఈ ఏడాది మార్చిలో కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో ఆసీస్‌ ఆటగాడు బెన్‌క్రాఫ్ట్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.

క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు

క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు

అయితే, ఈ బాల్ టాంపరింగ్ ఉదంతానికి బాధ్యులుగా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, బెన్‌క్రాఫ్ట్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకుంది. స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌‌లపై ఏడాది పాటు నిషేధం విధించగా... ఈ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన కామెరూన్ బాన్ క్రాప్ట్‌కు తొమ్మిది నెలల పాటు నిషేధం విధించింది.

ఆసీస్ పర్యటనలో దక్షిణాప్రికా

ఆసీస్ పర్యటనలో దక్షిణాప్రికా

అయితే, ఇప్పుడు సఫారీ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ పర్యనటలో భాగంగా నవంబర్ 4 నుంచి 17 వరకు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడనుంది. ఈ సిరిస్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌ శుక్రవారం విలేకర్ల సమావేశంలో పాల్గొన్నాడు.

ఆస్ట్రేలియా జట్టుపై స్లెడ్జింగ్‌కు దిగే ఆలోచన లేదు

ఆస్ట్రేలియా జట్టుపై స్లెడ్జింగ్‌కు దిగే ఆలోచన లేదు

బాల్‌ టాంపరింగ్‌ వివాదాన్ని అడ్డుపెట్టుకొని ఆస్ట్రేలియా జట్టుపై స్లెడ్జింగ్‌కు దిగే ఆలోచన లేదని అన్నాడు. ఈ సందర్భంగా డుప్లెసిస్ మాట్లాడుతూ "జరిగిందేదో జరిగిపోయింది. ప్రస్తుతం దాని గురించి పట్టించుకోవాలనుకోవట్లేదు. ఈ సిరీస్‌లో కొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించనున్నాం" అని చెప్పాడు.

దృష్టంతా వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్‌పైనే

దృష్టంతా వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్‌పైనే

"వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరగనున్న వరల్డ్‌కప్ లోపు జట్టును సమతూకంగా తయారుచేయడమే బాధ్యత" అని డుప్లెసిస్ చెప్పాడు. రెండేళ్ల క్రితం అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌ని డుప్లెసిస్ గుర్తు చేసుకున్నాడు. "అడిలైడ్‌లో జరిగిన నైట్ టెస్టు మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ చేసేందుకు మైదానంలో అడుగుపెట్టగా అరవై వేల మంది బూయింగ్ చేశారు" అని చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, October 27, 2018, 12:33 [IST]
Other articles published on Oct 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X