Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగు రోజుల టెస్టుని రెండు రోజుల్లోనే ముగించారు

Proteas thrash pitiful Zimbabwe inside two days

హైదరాబాద్: ప్రయోగాత్మకంగా జరిగిన నాలుగు రోజుల ఏకైక టెస్టులో రెండు రోజులు కూడా పూర్తిగా సాగకుండా ఫలితం వచ్చేసింది. దక్షిణాఫ్రికా అద్భుత ప్రదర్శన ముందు జింబాబ్వే తేలిపోయింది. బుధవారం ముగిసిన ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో జింబాబ్వేపై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.

రెండు రోజుల్లో కలిపి 176 ఓవర్లు ఆడాల్సి ఉంటే మ్యాచ్‌ 151.1 ఓవర్లకే ఫలితం వచ్చింది. దీంతో అతి తక్కువ బంతుల్లో (907) టెస్ట్ మ్యాచ్‌ను గెలిచిన జట్టుగా దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరు (309/9) పరుగుల వద్ద డిక్లేర్ చేసినప్పటికీ... ఇన్నింగ్స్ విజయాన్ని దక్కించుకున్న జట్టుగాకూడా నిలిచింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 30/4తో రెండో రోజు ఆట ప్రారంభించిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 30.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. జార్విస్ (23) టాప్ స్కోరర్. మోర్నీ మోర్కెల్‌ (5/21) ఐదు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో రెండో రోజు ఫాలోఆన్‌లో పడింది.

ఇక, రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 42.3 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో కేశవ్‌ మహరాజ్‌ (5/59), ఫెహ్లుక్వాయో (3/13)లు జింబాబ్వేని దెబ్బతీశారు. రెండో రోజు టీ విరామానికి 15 నిమిషాల ముందే మ్యాచ్‌ ముగిసిపోయింది. మొత్తం ఐదు సెషన్లు కూడా సాగని ఈ మ్యాచ్‌లో జింబాబ్వేను రెండు సార్లు ఆలౌట్‌ చేశారు.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఓపెనర్‌ మర్క్రమ్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 28, 2017, 7:41 [IST]
Other articles published on Dec 28, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+