For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లుంగి ఎంగిడి ఔట్: ఐపీఎల్ మొదలుకాకముందే చెన్నైకి గట్టి దెబ్బ

IPL 2019: Lungi Ngidi And Nortje Ruled Out Of The IPL | Oneindia Telugu
Proteas duo Ngidi and Nortje ruled out of IPL

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే, ఈ సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పక్కటెముకల నొప్పితో దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ లుంగి ఎంగిడి ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇటీవలే స్వదేశంలో శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎంగిడి ఇబ్బంది పడుతున్నాడని టీమ్ మేనేజర్ డాక్టర్ మూసాజీ తెలిపాడు. దీంతో అతడిని పునరావాస చికిత్స కోసం పంపిస్తున్నామని ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటం లేదని ముసాజీ తెలిపాడు

"బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎంగిడి ఇబ్బందిపడుతున్నాడు. వెంటనే బౌలింగ్ ఆపేసి స్కానింగ్‌కు పంపాం. గ్రేడ్ కండరాల్లో నొప్పి వస్తున్నట్లు తేలింది. దీంతో అతన్ని పునరావాస చికిత్స కోసం పంపిస్తున్నాం. వరల్డ్‌కప్ వరకు ఇది కొనసాగుతుండటంతో ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటం లేదు" అని చెప్పాడు.

ఇదే సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడాల్సిన అరిచ్ నోర్టిజే కూడా గాయం కారణంగా లీగ్‌కు దూరమయ్యాడు. 25 ఏళ్ల అరిచ్ నోర్జిజే ఇటీవలే శ్రీలంక ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కుడి భుజం గాయం కారణంగా ఐపీఎల్ 2019 సీజన్‌కు దూరమయ్యాడని జట్టు మేనేజర్ ముసాజీ తెలిపాడు

Story first published: Thursday, March 21, 2019, 12:47 [IST]
Other articles published on Mar 21, 2019
Read in English: Ndidi and Nortje out of IPL
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+