For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రో కబడ్డీ: సచిన్ వీక్షించిన రెండు మ్యాచ్‌ల్లో తలైవాస్ ఓటమి

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా గురువారం తమిళ్ తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్‌, కుమార్తె సారాతో కలిసి వీక్షించాడు. ప్రొ కబడ్డీ ఐదో సీజన్‌లో సచిన్‌ హాజరైన రెండో మ్యాచ్‌ ఇది.

ఈ సీజన్ ప్రారంభంలో తెలుగు టైటాన్స్‌తో తమిళ్ తలైవాస్ జట్ల మధ్య హైదరాబాద్ జరిగిన మ్యాచ్‌కి హాజరైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కూడా తమిళ్ తలైవాస్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, తాజా మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33-28 తేడాతో తమిళ్ తలైవాస్‌పై నెగ్గింది.

ఈ మ్యాచ్‌తో ప్రో కబడ్డీ ఐదో సీజన్‌లో ముంబైలో నిర్వహించే మ్యాచ్‌లు ముగిశాయి. సెప్టెంబరు 1 నుంచి 7 వరకు కోల్‌కతా వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, ప్రో కబడ్డీ లీగ్‌లో తమిళ్‌ తలైవాస్‌ జట్టుకి సచిన్‌ సహ యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే.

Pro Kabaddi 2017: Sachin Tendulkar attends last day of Mumbai leg with son Arjun, daughter Sara

తలైవాస్ ముంబైలో ఆడుతున్న చివరి మ్యాచ్ కావడంతో సచిన్ ఈ మ్యాచ్‌కి హాజరయ్యాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన తమిళ్ తలైవాస్‌ ఒక్క విజయం మాత్రమే సాధించింది. ఐదు మ్యాచుల్లో ఓటమి పాలవగా, రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది.

దీంతో తెలుగు టైటాన్స్‌ 23 పాయింట్లతో జోన్‌-బిలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా, 10 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో తలైవాస్‌ చివరి స్థానంలో కొనసాగుతోంది. జోన్‌-ఎలో భాగంగా జరిగిన జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 35-32 తేడాతో విజయం సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+