
హైదరాబాద్: ప్రేమికుల కోసం, స్నేహితుల కోసం, అమ్మ కోసం, మహిళల కోసం, బాలికల కోసం, తండ్రి కోసం ప్రత్యేకంగా ఓ రోజు ఉంది. అలానే పురుషుల కోసం కూడా ఓ రోజు ఉంది. ప్రపంచంలో ఏటా నవంబరు 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుతారు. ఐక్యరాజ్య సమితి ఆమోదంతో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 1999లో తొలిసారిగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరిగింది. అప్పటి నుంచి నవంబర్ 19న ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రపంచంలో ఇండియాతోపాటు ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్, కరీబీయన్ దీవులు, ఆఫ్రికాతో సహా 70 దేశాల్లో పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
పురుషుల అనారోగ్య సమస్యలపై దృష్టి సారించడం, లింగ వివక్ష లేని సమాజాన్ని సాధించడమే.. ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా అందరూ తమ దగ్గరివారికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు ఆయన సతీమణి ప్రియాంక చౌదరి రైనా కూడా శుభాకాంక్షలు తెలిపారు. దేశం గర్వించదగ్గ ఆటగాడిగా, భర్తగా, కుమారుడిగా, తండ్రిగా అన్ని పాత్రల్లో సరిగ్గా సరిపోతావు అం ఆమె పేరొన్నారు.
'ఈ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రాధాన్యమిస్తున్న నేటి సమాజంలో మగవారి పాత్ర మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల ఎంతో క్రియాశీలంగా మారింది. ఈ సందర్భంగా దేశం గర్వించదగ్గ నా జీవిత భాగస్వామికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి పాత్రలో (ఆటగాడిగా, భర్తగా, కుమారుడిగా, తండ్రిగా)నూ సరిగ్గా సరిపోతావు రైనా' అని ప్రియాంక ట్వీట్ చేశారు. రైనా తన భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ రీట్వీట్ చేశాడు.
సురేష్ రైనా గత ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన రైనా.. 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో పాల్గొనలేదు. తొలుత చెన్నై జట్టు సభ్యులతో యూఏఈ వెళ్లినా.. వ్యక్తిగత కారణాలతో తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. తన ఇంట్లో ఉంటూ కుటుంబ సభ్యులతో సేద తీరుతున్నాడు. రెండు రోజుల క్రితమే వారితో కలిసి పంటపొలాలకు వెళ్లి విందు భోజనం చేశాడు.