రిసెప్షన్‌లో అవాక్కయ్యాడు: సచిన్‌ని ఎవరు నువ్వు అడిగిన రైనా భార్య


హైదరాబాద్: ప్రియాంక రైనా.... టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా భార్యగా కంటే కూడా సామాజికవేత్తగా బాగా సుపరిచితం. స్వతహాగా డాక్టర్ అయిన ప్రియాంక రైనా గ్రేసియా రైనా ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటోంది. తాజాగా బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే వెబ్ సిరిస్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఒ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
తన మ్యారేజి రిసెప్షన్‌లో అభినందించడానికి వచ్చిన సచిన్ టెండూల్కర్‌ని "ఎవరు ఈయన" అని అడిగినట్లు చెప్పుకొచ్చింది. వివరాల్లోకి వెళితే... ప్రముఖ టీవీ వ్యాఖ్యాత శిభానీ దండేకర్ గత కొన్ని రోజులుగా క్రికెటర్ల భార్యలను మిస్ ఫీల్డ్ అనే వెబ్ సిరిస్ ద్వారా ఇంటర్యూలో చేస్తోన్న సంగతి తెలిసిందే.
తాజాగా టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా భార్య ప్రియాంకను ఇంటర్యూ చేసింది. ఇందులో భాగంగా శిభానీ దండేకర్ "ఎక్కడో ఒకచోట చదివాను మీకు పెళ్లి అయిన కొత్తలో సచిన్ టెండూల్కర్‌ను ఎవరీయన అని అడిగారని విన్నాను, నిజమేనా?" అని ప్రశ్నించింది.

నేను యంగ్‌గా ఉన్నప్పుడు
ఇందుకు ప్రియాంక రైనా సైతం అవునని సమాధానమిచ్చింది. అంతేకాదు అసలు అలా ఎందుకు అడగాల్సి వచ్చిందో కూడా వివరించింది. ప్రియాంక మాట్లాడుతూ "నేను యంగ్‌గా ఉన్న అప్పట్లో ఆడిన క్రికెటర్లు అందరి గురించి తెలుసు. ఆ తర్వాత క్రికెట్‌ను పట్టించుకోకపోవడంతో, టచ్ కూడా పోయింది" అని చెప్పుకొచ్చింది.

రిసెప్షన్ సమయంలో
"రైనాతో నాకు పెళ్లి అయిన తర్వాత రిసెప్షన్ సమయంలో చాలా మంది క్రికెటర్లు అభినందనలు తెలపడానికి వచ్చారు. ఆ సమయంలో నేను పక్కనే ఉన్న రైనాను 'ఎవరీ ఆయన, ఆయన పేరేంటి?' అని అడిగాను. అక్కడికి వచ్చిన వారిలో కొంతమంది మాత్రమే తెలుసు, దీంతో ఆ ప్రశ్న అడగాల్సి వచ్చింది" అని రైనా భార్య చెప్పింది.

పెళ్లికి ముందే చెప్పిన సురేశ్ రైనా
నిజానికి ప్రియాంకకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. ఈ విషయాన్ని సురేశ్ రైనా పెళ్లికి ముందే చెప్పాడు. తనకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదని, పుట్ బాల్ అంటే మాత్రం పడి చస్తుందని సురేశ్ రైనా అప్పట్లో వెల్లడించాడు. మెస్సీకి ఆమె పెద్ద ఫ్యాన్ అని రైనా తెలిపాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరీని సురేశ్ రైనా 2016లో పెళ్లి చేసుకున్నాడు.
'గ్రేసియా రైనా ఫౌండేషన్' పేరిట సేవలు
వీరికి ఓ పాప గ్రేసియా రైనా. తన కుమార్తె మొట్టమొదటి పుట్టినరోజు సందర్భంగా సురేశ్ రైనా 'గ్రేసియా రైనా ఫౌండేషన్'ను స్థాపించాడు. దీని ద్వారా ఎంతో మంది అభాగ్యులను ఆదుకుంటున్నారు. ఇక, సురేశ్ రైనా విషయానికి వస్తే భారత జట్టులో చోటు దక్కించుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications