England vs India 5th test: కేఎల్ రాహుల్ స్థానంలో టెస్ట్ జట్టుకు ఎంపికయ్యే ప్లేయర్ అతనే..!

భారత ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గజ్జలో గాయం కారణంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరగబోయే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ సహా పూర్తి ఇంగ్లాండ్ పర్యటనకు దూరమయ్యే అవకాశముంది. ఇక రాహుల్ చికిత్స కోసం జర్మనీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక రోహిత్ శర్మ గైర్హాజరీతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు రాహుల్ కెప్టెన్‌గా సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. సిరీస్ ప్రారంభానికి ముందు అతను గాయపడి పూర్తి సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇకపోతే గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో భారత ఓపెనర్లలో రాహుల్ ఒకడు. అతను జట్టుకు రెగ్యులర్ ఎంపికగా ఉన్నాడు. అతను ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో 315పరుగులు చేశాడు. ఇక లార్డ్స్‌లో 129పరుగుల అద్భుతమైన నాక్ కూడా ఆడాడు. ఇక రాహుల్ ఇంగ్లాండ్‌తో చివరి టెస్టుకు దూరం కావడంతో సెలెక్టర్లు అతని స్థానంలో సరైన ప్లేయర్ కోసం చూస్తున్నారు. ఇక మయాంక్ అగర్వాల్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ తదితరుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు పెద్దగా పేరు వినబడని ప్లేయర్ కూడా ఎంపికయ్యేందుకు పుష్కల అవకాశాలున్నాయి. అతనే 32ఏళ్ల ప్రియాంక్ పాంచల్.
గుజరాత్‌కు చెందిన ప్రియాంక్ పాంచల్ రంజీ ట్రోఫీలో చాలా కాలంగా ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు. అతను టీమిండియాలో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. అతను 101 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 45కంటే ఎక్కువ సగటుతో 314* టాప్ స్కోర్‌తో 7,000కు పైగా పరుగులు చేశాడు. అతను రైట్-ఆర్మ్ మీడియం పేసర్ కూడా. అతను తన బౌలింగ్లో ఒక ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు ఇవ్వకుండా మూడు వికెట్లు తీసి తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. ఎక్కువగా పాంచల్ బౌలింగ్ మీద ఫోకస్ పెట్టలేదు. అందువల్ల అతను టెస్టుల్లో కేవలం 14వికెట్లు మాత్రమే తీశాడు. గత ఏడాది ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌కు ఐదుగురు స్టాండ్‌బై ఆటగాళ్లలో పాంచల్ కూడా ఒకడు. అతను 2021నవంబర్లో దక్షిణాఫ్రికా పర్యటన కోసం టీమిండియా Aజట్టుకు కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. అందువల్ల ప్రియాంక్ పంచల్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications