Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NO.4 స్పాట్ నా ఫేవరేట్: ప్రియమ్ గార్గ్

Priyam Garg says IPL is a big platform for emerging players, as they can get chance to play in Indian team

హైదరాబాద్: NO.4 స్పాట్ నా ఫేవరేట్ అని టీమిండియా అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్వవహారించిన ప్రియమ్ గార్గ్ తెలిపాడు. లాక్ డౌన్‌లో గత నెల రోజులు నుంచి కుటుంబంతో గడపడం చాలా సంతోషంగా ఉందని ప్రియమ్ చెప్పాడు. ప్రస్తుతం ఫిట్‌నెప్‌పై దృష్టి సారిస్తున్నానని తెలిపాడు. బుధవారం హలో యాప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమ్ గార్గ్ అనేక విషయాలను పంచుకున్నాడు.

NO.4 స్పాట్ అంటే ఇష్టం:

NO.4 స్పాట్ అంటే ఇష్టం:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 వేలంలో ప్రియమ్ గార్గ్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ జర్నలిస్ట్ అనుపమ్ పాండే అడిని పలు ప్రశ్నలకు ప్రియమ్ గార్గ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. సన్‌రైజర్స్ జట్టులో ఏ సంఖ్య బ్యాటింగ్ చేస్తారు అని అడగ్గా.. NO.4 స్పాట్ అంటే ఇష్టం, అక్కడే బ్యాటింగ్ చేస్తా. అయితే జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని జవాబిచ్చాడు. ఇష్టమైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని చెప్పాడు. అయితే సచిన్‌ను కలిసే అవకాశం ఇంకా రాలేదన్నాడు.

బుమ్రా అంటే ఇష్టం:

బుమ్రా అంటే ఇష్టం:

ఇష్టమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అని ప్రియమ్ గార్గ్ పేర్కొన్నాడు. అండర్-19 జట్టులో ఇష్టమైన అందరూ ఇష్టమైన ఆటగాళ్లే అని, ప్రత్యేకంగా చెప్పమంటే శుభమాన్ గిల్ ఇష్టం అని అన్నాడు. విరాట్ కోహ్లీ లేదా ఎంఎస్ ధోనీలలో ఒకరినే ఎంచుకోమంటే.. ధోనీకి ఓటేశాడు. ఇండియన్ పుడ్, ఇన్‌స్టాగ్రామ్ ఇష్టమని ప్రియమ్ తెలిపాడు. డబ్బు కన్నా గౌరవం ముఖ్యమన్నాడు. లాక్ డౌన్‌లో గత నెల రోజులు నుంచి కుటుంబంతో గడపడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ప్రస్తుతం ఫిట్‌నెప్‌పై దృష్టి సారిస్తున్నానని.. ఇందులో భాగంగా సాయంత్రం సమయంలో శిక్షణ ప్రారంభిస్తున్నానని.. వారంలో మూడు సార్లు యోగా చేస్తున్నట్లు గార్గ్ చెప్పాడు.

బౌలర్ ఎవరో చూడను:

బౌలర్ ఎవరో చూడను:

'ఐపీఎల్ అనేది యువ ఆటగాళ్లకు సరైన వేదిక. దీంతో ఎంతో మంది విదేశీ ఆటగాళ్లను కలిసే అవకాశం లభిస్తుంది. ఐపీఎల్‌లో రాణిస్తే జాతీయ జట్టులో ఆడేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్ అక్టోబర్ లేదా నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది' అని ప్రియమ్ గార్గ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్‌ను ఎదుర్కొవాల్సి వస్తే.. తాను బౌలర్ ఎవరో చూడనని అన్నాడు. ఫేవరేట్ టీమ్ ఏమీ లేదని, ప్రస్తుతం తాను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో సంతోషంగా ఉన్నానని తెలిపాడు.

అత్యుత్తమ ప్రదర్శనే ఇచ్చేందుకు ప్రయత్నిస్తా:

అత్యుత్తమ ప్రదర్శనే ఇచ్చేందుకు ప్రయత్నిస్తా:

'ఐపీఎల్‌తో విదేశీ ఆటగాళ్లతో అనుభవాలను పంచుకునే అవకాశం లభిస్తుంది. ఇది ప్రతిక్కరికి ఎంతో లాభించనుంది. నేను ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రదర్శనే ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ప్రతి ఆటగాడికి ఆదర్శంగా నిలుస్తాడు' అని ప్రియమ్ గార్గ్ చెప్పుకొచ్చాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే.

Story first published: Wednesday, May 6, 2020, 21:42 [IST]
Other articles published on May 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+