Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs SRH: చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఆడుతున్నాం.. అదే ఈరోజు కలిసొచ్చింది: గార్గ్

Priyam Garg says I was playing with Abhishek since childhood, we both know each others game very well

దుబాయ్‌: ఐపీఎల్‌ 2020లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శుక్రవారం వార్నర్ సేన 7 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించింది. మొదట దీపక్‌ చహర్‌ (2/31), పీయూష్ చావ్లా (1/20) సన్‌రైజర్స్‌ను దెబ్బ తీసినా.. 20 ఏళ్ల ప్రియమ్‌ గార్గ్‌ (51 నాటౌట్‌; 26 బంతుల్లో 6×4, 1×6) సంచలన ఇన్నింగ్స్‌ ఆడటంతో ఆ జట్టు పుంజుకుని 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 5 వికెట్లకు 157 పరుగులకే పరిమితమైంది. రవీంద్ర జడేజా (50; 35 బంతుల్లో 5×4, 2×6), ఎంఎస్ ధోనీ (47 నాటౌట్‌; 36 బంతుల్లో 4×4, 1×6) పోరాడినా ఫలితం లేకపోయింది. గార్గ్‌కే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

జట్టుకు ఊహించని స్కోరు:

జట్టుకు ఊహించని స్కోరు:

మొదటగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 10 ఓవర్లలో జానీ బెయిర్‌స్టో (0), డేవిడ్ వార్నర్‌ (28), మనీష్‌ పాండే (29), కేన్ విలియమ్సన్‌ (9)ల వికెట్లు కోల్పోయి 69 పరుగులే చేసింది. దీంతో సన్‌రైజర్స్‌ 140 చేస్తే ఎక్కువే అనిపించింది. ఎందుకంటే.. ఒకవైపు టాప్ బ్యాట్స్‌మన్‌లు పెవిలియన్ చేరారు, మరోవైపు మిగిలింది అనుభవం లేని కుర్రాళ్లు మాత్రమే. అయితే ప్రియం గార్గ్‌, అభిషేక్‌ శర్మ అనూహ్యంగా చెలరేగి జట్టుకు ఊహించని స్కోరు అందించారు. చెన్నై బౌలర్లు పట్టు విడవడం, కొన్ని క్యాచ్‌లు చేజారడం కూడా కలిసొచ్చింది. దీంతో స్కోరు చూస్తుండానే పెరిగిపోయింది. గార్గ్‌, అభిషేక్‌ ఐదో వికెట్‌కు 55 బంతుల్లోనే 75 పరుగులు జోడించడంతో సన్‌రైజర్స్‌ 160 మార్కును దాటింది.

 గార్గ్‌ కారణంగా కేన్ రనౌట్:

గార్గ్‌ కారణంగా కేన్ రనౌట్:

యువ బ్యాట్స్‌మన్‌ ప్రియమ్‌ గార్గ్‌ క్రీజులోకి అడుగు పెట్టేసమయానికి విలియమ్సన్‌ మీదే పూర్తి భారం ఉంది. గార్గ్‌ కారణంగా కేన్ రనౌటైపోయాడు. షార్ట్‌ మిడ్‌వికెట్‌లోకి బంతిని పంపి కేన్‌ పరుగు తీస్తూ ముందుకొచ్చేయగా.. అవతలి నుంచి గార్గ్‌ రాలేదు. చెన్నై ఫీల్డర్ అంబటి రాయుడు బంతిని వేగంగా కీపర్ ఎంఎస్ ధోనీకి విసిరాడు. దీంతో సగం పిచ్‌ నుంచి వెనక్కి మళ్లిన విలియమ్సన్‌ రనౌటైపోయాడు. ఆ సమయంలో అందరూ గార్గ్‌ను తిట్టుకున్నవాళ్లే. సన్‌రైజర్స్‌కు అతను పెద్ద నష్టమే చేశాడని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో ముందు క్రీజులో నిలదొక్కుకుని ఆ తర్వాత ధాటిగా షాట్లు ఆడిన గార్గ్‌.. తన సత్తా ఎలాంటిదో చూపించాడు. ముఖ్యంగా సామ్‌ కరన్‌ వేసిన 17వ ఓవర్లో అతను చెలరేగిపోయాడు. వరుసగా 4, 4, 6, 4 బాదాడు.

అభిషేక్‌తో చిన్నప్పటి నుంచి ఆడుతున్నా:

అభిషేక్‌తో చిన్నప్పటి నుంచి ఆడుతున్నా:

'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు అందుకున్న అనంతరం ప్రియమ్‌ గార్గ్‌ మాట్లాడుతూ... 'మ్యాచ్ గెలిచినందుకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. సీనియర్ ఆటగాళ్లతో ఆడడం ఎప్పుడూ ప్రత్యేకమే. నా ఆట గురించి నాకు తెలుసు కాబట్టి సహజ శైలిలో ఆడాను. ఈ క్రెడిట్ అంతా జట్టు యాజమాన్యానిదే. వారు నాకు అండగా నిలిచారు. నేను చిన్నప్పటి నుంచి అభిషేక్‌తో ఆడుతున్నాను. మా ఇద్దరికీ ఒకరి ఆట గురించి మరొకరికి బాగా తెలుసు. నిజంగా ఈ రోజు అదే సహాయపడింది. బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసేటప్పుడు మంచి ఆత్మవిశ్వసంతో ఉన్నాను' అని తెలిపాడు.

అండర్‌-19 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా:

అండర్‌-19 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా:

గత ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా భారత యువ జట్టును చక్కగా నడిపించి వార్తల్లోకెక్కాడు ప్రియమ్‌ గార్గ్‌. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ఆ టోర్నీలో సత్తా చాటిన అతణ్ని సన్‌రైజర్స్‌ వేలంలో కొనడమే కాదు.. తొలి సీజన్లోనే తుది జట్టులో రెగ్యులర్‌ ఆటగాణ్ని చేసింది. ఇప్పటిదాకా పెద్దగా ప్రభావం చూపని అతను.. శుక్రవారం జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉండగా చక్కటి ఇన్నింగ్స్‌ ఆడి అందరి దృష్టిలో పడ్డాడు.

Story first published: Saturday, October 3, 2020, 8:50 [IST]
Other articles published on Oct 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+