విరాట్ కోహ్లీని గుర్తుచేసి.. ప్రియా పూనియాలో స్ఫూర్తి నింపిన ఆమె తండ్రి! ఇంగ్లండ్ పర్యటనకు రెడీ!

హైదరాబాద్: టీమిండియా మహిళా ఓపెనర్ ప్రియా పూనియా తల్లి ఇటీవలే కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన విషయం తెలిసిందే. మే 18న ప్రియా తల్లి సరోజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే జూన్‌లో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనకు ప్రియాను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయగా.. జూన్ 2న జట్టు అక్కడికి వెళ్లనుంది. కానీ తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఆమెలో స్ఫూర్తి నింపేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఉదాహరణగా చూపినట్లు ఆమె తండ్రి సురేందర్ పేర్కొన్నారు.

పాప పరిస్థితులను అర్థం చేసుకుంది:
'ఇంగ్లండ్ పర్యటన కోసం నా కుమార్తె (ప్రియా పూనియా)లో నేను స్ఫూర్తి నింపాలనుకున్నా. విరాట్ కోహ్లీకి ఎదురైన ఇలాంటి అనుభవం గురించి ప్రస్తావించా. కోహ్లీ తన తండ్రిని కోల్పోయినా.. రంజీ మ్యాచ్ ఆడటానికి వెళ్లాడని చెప్పా. మా కుటుంబానికి ఇది చాలా క్లిష్ట పరిస్థితి. కానీ మేం మానసికంగా ధైర్యంగా ఉండాల్సిన సమయమిది. జీవితంలో ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తానికి పాప పరిస్థితులను అర్థం చేసుకుంది. నాన్నా.. నేను ఆడేందుకు సిద్ధమని చెప్పింది' అని సురేందర్ తెలిపారు.

ఇంగ్లండ్ టూర్‌కు భారత్:
మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల క్రికెట్ టీమ్ మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది. ప్రతి ఫార్మాట్‌కు 18 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఇటీవలే ఎంపిక చేసింది. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూన్ 16-19 వరకు బ్రిస్టల్‌లో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. జూన్ 27న బ్రిస్టల్ మొదటి వన్డేకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. రెండవ వన్డే (డే-నైట్) జూన్ 30న టౌంటన్‌లో జరుగుతుంది. మూడవ వన్డే జూన్ 3న జరుగుతుంది. మొదటి టీ20 మ్యాచ్ జూలై 9న నార్తాంట్స్‌లో, రెండో టీ20 జూలై 11న హోవ్‌లో, మూడో టీ20 జూలై 15న చెల్మ్స్ ఫోర్డ్‌లో జరగనున్నాయి.

ముంబై నుంచి లండన్‌కు:
టీమిండియా పురుషుల మరియు మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కలిసి త్వరలోనే ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ప్రయాణించనున్నారు. ఇంగ్లండ్ పర్యటన కోసం కోహ్లీసేన, మిథాలీ బృందం జూన్ 2న ముంబై నుంచి లండన్‌కు బయల్దేరనుంది. పురుషులు, మహిళల క్రికెట్ జట్లకు చెందిన ఆటగాళ్లు ఒకే చార్టర్డ్ విమానంలో కలిసి ప్రయాణించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇలా భారత బృందం కలిసివెళ్లడానికి కరోనా వైరస్ కారణం.

టెస్ట్, వన్డే జట్టు:
మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధనా, హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), పూనమ్ రౌత్, ప్రియా పునియా, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, స్నేహ రానా, తానియా భాటియా (వికెట్ కీపర్), ఇంద్రాణి రాయ్ (వికెట్ కీపర్), జులాన్ గోస్వామి, శిఖా పాండే, పూజా వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, రాధా యాదవ్.
టీ20 జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్) స్మృతి మంధన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, స్నేహ రానా, తానియా భాటియా (వికెట్ కీపర్), ఇంద్రాణి రాయ్ (వికెట్ కీపర్), శిఖా పాండే, పూజా వస్త్రకర్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, రాధా యాదవ్, సిమ్రాన్ దిల్ బహదూర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications