Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Prithivi Shaw: మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన పృథ్వీ షా!.. బ్యాట్‌తో విధ్వంసం

Prithivi Shaw: టీమిండియా నుంచి చాలా కాలంగా దూరంగా ఉన్న పృథ్వీ షా టీ20 ముంబై లీగ్‌లో తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. నార్తర్న్ ముంబై పాంథర్స్ తరపున ఆడుతూ ప్రత్యర్థి జట్టు ట్రయంఫ్ నైట్స్ బౌలింగ్ అటాక్‌ను పూర్తిగా ధ్వంసం చేశాడు. 220 స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ కేవలం 34 బంతుల్లో 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పృథ్వీ షా కేవలం 23 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. అయితే నార్తర్న్ ముంబై కెప్టెన్ తన ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించాడు. మొదటి 10 బంతుల్లో పృథ్వీ షా కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఆ తర్వాత పృథ్వీ షా తన గేర్ మార్చి తదుపరి 13 బంతుల్లో 36 పరుగులు చేసి అర్థ సెంచరీ సాధించాడు.

తిరిగి ఫామ్‌లోకి వచ్చిన పృథ్వీ షా
క్రికెట్‌లో గత కొంతకాలంగా నిరాశపరుస్తున్న పృథ్వీ షా తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. టీ20 ముంబై లీగ్‌లో ట్రయంఫ్ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా ఊచకోత కోశాడు. పృథ్వీ షా కేవలం 34 బంతుల్లో 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన ఈ ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా 12 ఫోర్లు, మూడు సిక్సులు బాదాడు. 220 స్ట్రైక్ రేట్‌తో పృథ్వీ షా ప్రత్యర్ధి జట్టు బౌలింగ్ అటాక్‌ను చిన్నాభిన్నం చేశాడు. పృథ్వీ షా అర్జున్ జైస్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత పృథ్వీ షా.. హర్షల్ జాదవ్ తో కలిసి వేగంగా 30 పరుగులు జోడించాడు.

Prithvi Shaw s Blazing Return Dominates T20 Mumbai League with 75 Off 34 Balls

తొలి 10 బంతుల్లో కేవలం 14 పరుగులే..
పృథ్వీ షా మొదట్లో క్రీజులో నిలదొక్కుకోవడాని చాలా సమయం తీసుకున్నాడు. పృథ్వీ షా మొదట్లో చాలా నెమ్మదిగా ఆడుతున్నట్లు కనిపించాడు. 10 బంతులు ఆడిన తర్వాత పృథ్వీ షా ఖాతాలో కేవలం 14 పరుగులు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ తర్వాత పృథ్వీ షా బ్యాట్ వేగం పుంజుకుంది. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో మినాద్ మంజ్రేకర్ బౌలింగ్‌లో 6 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. ఓవర్లోని మొదటి రెండు బంతుల్లో పృథ్వీ షా 2 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత తదుపరి బంతిని పృథ్వీ షా ప్రేక్షకుల్లోకి పంపాడు. ఓవర్లోని తదుపరి 3 బంతుల్లో పృథ్వీ వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. ఈ విధం మినాద్ ఓవర్లో మొత్తం 26 పరుగులు రాబట్టాడు.

Story first published: Sunday, June 8, 2025, 20:07 [IST]
Other articles published on Jun 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+