Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దశాబ్దంలోనే అతి చిన్న వయస్సున్న క్రికెటర్ అరంగ్రేటం(వీడియో)

Prithvi Shaw -to know about India’s Test debutant

న్యూ ఢిల్లీ: వెస్టిండీస్‌తో తలపడుతోన్న భారత జట్టులో యువ క్రికెటర్ పృథ్వీ షా అరంగ్రేటం చేశాడు. ముంబై శివారు ప్రాంతమైన విరార్ లో పుట్టి పెరిగాడు. నాలుగేళ్ల ప్రాయంలోనే తల్లిని కోల్పోవడంతో అన్నీ తానై తండ్రే అతణ్ని పెంచాడు. ఎనిమిదేళ్ల వయస్సున్నప్పుడు క్రికెట్‌ను కెరీర్‌గా చేసుకోవాలని బాంద్రాలోని స్కూలులో చేరాడు. షా ను స్కూలు తీసుకెళ్లేందుకు 90నిమిషాలు సమయం పడుతుందని అతని తండ్రి పంకజ్ షా వ్యాపారాన్ని ఆపేసి స్కూలులో దింపేవాడు.

1
44264
యువ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు

యువ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు

14 ఏళ్లకే ముంబై డివిజన్ కంగా లీగ్‌లో వంద పరుగులు చేసిన యువ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. డిసెంబరు 2014న స్కూలు తరపున 546పరుగులు చేసి రికార్డుల్లో నిలిచిపోయాడు. ప్రతిభను గుర్తించిన ముంబై క్రికెట్ అసోసియేషన్ అతణ్ని ముంబై అండర్ 16జట్టుకు కెప్టెన్‌గా నియమించింది. ఆ తర్వాత అరంగ్రేట మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన రికార్డును రెండు దశాబ్దాలుగా ఎవరూ సాధించలేని పరుగులు చేయగలిగాడు.

టీమిండియాలో ధావన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు

న్యూజిలాండ్ వేదికగా అండర్ 19కప్‌ను గెలుచుకున్న టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్ 2018లో ఆడని షా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో 245 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ పర్యటన చేసిన భారత్ ఏ జట్టులో 603పరుగులు చేసి 60.3 సగటుతో విజృంభించి ఆడాడు. ఇంగ్లాండ్ పర్యటన చేసిన టీమిండియా జట్టులో రెండు టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. వెస్టిండీస్‌తో ఆడుతోన్న టీమిండియాలో ధావన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బరిలోకి దిగాడు.

నైపుణ్యాన్ని ఆటను మెరుగుపరుచుకుంటున్నాడని

నైపుణ్యాన్ని ఆటను మెరుగుపరుచుకుంటున్నాడని

షా ప్రతి స్థాయిలోనూ క్రమంగా నైపుణ్యాన్ని పెంచుకుంటూ.. తన ఆటను మెరుగుపరుచుకుంటున్నాడని అండర్ 19 టీమిండియా..భారత్ ఏ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రవిడ్ అన్నారు. ఒకానొక సమయంలో షా ఆటను గమనించిన సచిన్ టెండూల్కర్ షా ఆడే తీరును చూసి సంతోషాన్ని వ్యక్తం చేశాడట. అతను బ్యాటింగ్ చేసే పొజిషన్‌ను ఎప్పుడూ మార్చుకోవద్దని అలా మార్చమని ఎవరైనా చెబితే నా పేరు చెప్పాలని కూడా సూచించారట.

ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవమే కానీ

ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవమే కానీ

ప్రస్తుత టెస్టు అరంగ్రేటం గురించి షా మాట్లాడుతూ.. 'కొంచెం ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవమే కానీ, కెప్టెన్ కోహ్లీ.. రవిశాస్త్రిలు భయం పోయే విధంగా మాట్లాడారు. డ్రెస్సింగ్ రూమ్ ను సీనియర్లతో పాటు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.' అని పేర్కొన్నాడు.

Story first published: Thursday, October 4, 2018, 12:33 [IST]
Other articles published on Oct 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+