న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పృథ్వీషా మెరుపులు.. 100 బంతుల్లో 150 పరుగులు.. రీఎంట్రీ ఖాయమేనా?

Prithvi Shaw smashes 150 off 100 balls for India A, excites selectors ahead of New Zealand Tests

లింకోయిన్‌: భారత యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా మరోసారి చెలరేగాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా భారత-ఎ జట్టుకు ఆడుతున్న పృథ్వీ షా మెరుపు సెంచరీ చేసాడు. న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో జరిగిన రెండో వన్డే వార్మప్‌ మ్యాచ్‌లో పృథ్వీ షా 150 (100 బంతుల్లో; 22 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు సాధించాడు. గాయాలతో సతమవుతున్న పృథ్వీ షా.. కివీస్‌తో తొలి వార్మప్‌ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అయితే రెండో వన్డే వార్మప్‌ మ్యాచ్‌లో మాత్రం మెరుపులు మెరిపించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ధావన్-రోహిత్ ఆడుతున్నారు!!టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ధావన్-రోహిత్ ఆడుతున్నారు!!

పృథ్వీ షాతో పాటు ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ (58; 41 బంతుల్లో 6 ఫోర్లు) సత్తాచాటడంతో భారత-ఎ జట్టు 372 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య చేధనలో న్యూజిలాండ్‌ ఎలెవన్‌ 360 పరుగులు చేసి ఓటమి పాలైంది. కివీస్‌ ఆటగాళ్లలో జాక్‌ బోలే (130), ఫిన్‌ అలెన్‌ (87), డార్లీ మిచెల్‌ (41), డాన్‌ క్లీవర్‌ (44)లు రాణించారు. భారత బౌలరల్లో కృనాల్‌ పాండ్యా, ఇషాన్‌ కోర్‌లు తలో రెండు వికెట్లు తీయగా.. మహ్మద్‌ సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌లు చెరో వికెట్‌ తీశారు.

న్యూజిలాండ్‌లో జరిగే టెస్టు, వన్డే సిరీస్‌ కోసం భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలో ఎంపిక చేయనుంది. పృథ్వీ షా తాజా ప్రదర్శనతో అతన్ని న్యూజిలాండ్‌ టెస్టు జట్టులో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌లు ఓపెనర్ల బెర్తులు ఖాయం చేసుకున్నారు. ఇక మూడో ఓపెనర్‌ కోసం తీవ్ర పోటీ నెలకొంది. వన్డే, టీ20ల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న లోకేశ్‌ రాహుల్‌ను టెస్టు టీమ్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

రాహుల్‌ తన చివరి టెస్టును వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్‌లో గత ఆగస్టులో ఆడాడు. ఆపై విఫలమై చోటు కోల్పోయి మళ్లీ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. మరోవైపు పృథ్వీ షా కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా, మూడో ఓపెనర్‌గా రాహుల్‌ను తీసుకుంటారా.. లేక పృథ్వీ షాకు అవకాశం ఇస్తారా అనేది వేచిచూడాలి. ఈ పోటీలోకి శిఖర్ ధావన్ కూడా ఉండే అవకాశం ఉంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అతనికి కలిసొచ్చే అంశం.

Story first published: Sunday, January 19, 2020, 14:44 [IST]
Other articles published on Jan 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X