Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌లో రీఎంట్రీ: పృథ్వీ షా మెరుపులు.. ముంబై భారీ విజయం

Prithvi Shaw slammed a 32-ball fifty for Mumbai against Assam in the Syed Mushtaq Ali Trophy match

ముంబై: నిషేధిత ఉత్ప్రేరకం వాడి నిషేధానికి గురై క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన ముంబై ఓపెనర్‌ పృథ్వీ షా బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా మెరుపులు మెరిపించాడు. అస్సాం బౌలర్లపై విరుచుకుపడి 39 బంతుల్లోనే 63 పరుగులు చేసాడు.

పృథ్వీ షా మెరుపులు

పృథ్వీ షా మెరుపులు

టాస్‌ ఓడిన ముంబైకి ఓపెనర్లు పృథ్వీ షా, ఆదిత్యా తారేలు మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ అస్సాం బౌలర్లపై చెలరేగి ముంబై స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పృథ్వీ షా 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేయగా.. ఆదిత్యా తారే 48 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసారు. షా, తారే మెరుపులతో ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

బీసీసీఐ స్వాగతం

బీసీసీఐ స్వాగతం

లక్ష్య ఛేదనలో అస్సాం 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 123 పరుగులే చేసింది. దీంతో ముంబై 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై బౌలర్ల దాటికి అస్సాం ఆటగాళ్లు పరుగులు చేయలేకపోయారు. పునరాగమనం చేసిన తొలి మ్యాచ్‌లోనే విజృంభించిన పృథ్వీ షాకు బీసీసీఐ స్వాగతం పలికింది. షా అర్ధ శతకం సెలబ్రేషన్స్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

 8 నెలల సస్పెన్షన్‌:

8 నెలల సస్పెన్షన్‌:

డోపింగ్‌ పరీక్షలో విఫలమైన పృథ్వీ షాను బీసీసీఐ ఎనిమిది నెలలు సస్పెండ్ చేసింది. గత మార్చిలో ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడిన షా.. జలుబు చేయడంతో దగ్గు మందు వాడాడు. అందులో 'వాడా' బహిస్కృత డ్రగ్ 'టర్బులిన్' ఉంది. బోర్డు అనుమతి లేకుండా ఈ డ్రగ్ తీసుకోవడంతో.. 8 నెలల సస్పెన్షన్‌ ఎదుర్కొన్నాడు.

పృథ్వీషా 2.0:

పృథ్వీషా 2.0:

నవంబర్‌ 15న పృథ్వీ షాపై సస్పెన్షన్‌ తొలగిపోయింది. గత వారంలో పుట్టినరోజు జరుపుకున్న షా పునరాగమనం తర్వాత చెలరేగుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఇకపై మీరు పృథ్వీషా 2.0ని చూస్తారని ఓ ట్వీట్‌ కూడా చేశాడు. అందుకు తగ్గట్టుగానే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నమెంట్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అతడు రెచ్చిపోయాడు.

Story first published: Sunday, November 17, 2019, 17:12 [IST]
Other articles published on Nov 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+