
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో ఢిల్లీ కేపిటల్స్.. మరో విజయాన్ని సొంతం చేసుకుంది. కోల్‌కత నైట్ రైడర్స్‌పై తిరుగులేని విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. టైటిల్ హాట్ ఫేవరెట్‌గా ఈ సీజన్‌ను ఆరంభించిన ఢిల్లీ కేపిటల్స్.. దానికి తగినట్టుగా ఆటతీరును కనపరుస్తోంది. ఫామ్ కోల్పోయిన కోల్‌కత నైట్ రైడర్స్‌తో గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గురవారం రాత్రి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసింది. కోల్‌కత నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్‌ను ఇంకా 21 బంతులు ఉండగానే ఛేదించింది.
ఢిల్లీ కేపిటల్స్..తొలి ఓవర్ నుంచి టాప్ స్పీడ్‌లో దూసుకెళ్లింది. శివమ్ మావి వేసిన తొలి ఓవర్‌లోనే ఒక వైడ్ సహా 25 పరుగులొచ్చాయి. ఓపెనర్ పృథ్వీ షా ఆరు బంతులకు ఆరు బౌండరీలను బాదేశాడు. ఒకే ఓవర్‌లో ఆరు బౌండరీలను కొట్టిన రెండో బ్యాట్స్‌మెన్ అతనే. దీనితోపాటు- ఐపీఎల్ సీజన్లన్నింటిలోనూ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన రెండో బ్యాట్స్‌మెన్ కూడా అతనే. ఈ రెండు అరుదైన రికార్డుల్లో పృథ్వీ షా సెకెండ్ ప్లేస్‌లోనే నిలిచాడు. ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లను సాధించిన తొలి బ్యాట్స్‌మెన్.. అజింక్య రహానె. 2012 ఐపీఎల్ సీజన్‌లో రహానే ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లను కొట్టాడు. మిర్రర్ రిఫ్లెక్ట్ అన్నట్టు.. 2021లో పృథ్వీ షా ఈ రికార్డును నెలకొల్పాడు.
తన మెరుపు ఇన్నింగ్‌తో మరో ఘనతను కూడా అందుకున్నాడీ ఢిల్లీ ఓపెనర్. అతి తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 18 బంతుల్లోనే షా హాఫ్ సెంచరీ సాధించాడు. అతని కంటే ముందు- రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్.. ఈ ఫీట్‌ను రికార్డ్ చేశాడు. 17 బంతుల్లోనే మోరిస్ 50 పరుగులు చేశాడు. ఢిల్లీ కేప్టెన్ రిషభ్ పంత్ కూడా 18 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఢిల్లీ కేపిటల్స్‌కే చెందిన మరో ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ చెరో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు.
ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులను పిండుకున్న బ్యాట్స్‌మెన్ల జాబితాలో పృథ్వీ షా టాప్‌లో ఉన్నాడు. 2009లో ఓఝా-21 పరుగులు చేయగా.. 2018లో సునీల్ నరైన్ కూడా ఒకే ఓవర్‌లో 21 రన్స్ చేశాడు. 2009లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఒకే ఓవర్‌లో 20 పరుగులు చేయగా.. క్రిస్ గేల్ రెండుసార్లు ఈ ఘనతను అందుకున్నాడు. 2011, 2014లో అతను ఒకే ఓవర్‌లో 20 పరుగులను రాబట్టుకున్నాడు. అహ్మదాబాద్ మ్యాచ్‌లో పృథ్వీ షా ధాటికి.. నాలుగు ఓవర్లను వేయాల్సిన శివమ్.. ఆ ఒక్క ఓవర్ తరువాత మరోసారి బౌలింగ్ చేయడానికి ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయాడు.