ఆన్ ది ఫీల్డ్ బాస్.. ఆఫ్ ది ఫీల్డ్ ఫ్రెండ్.. ‘చక్‌దే ఇండియా’లోని షారూఖ్‌లానే.. పాంటింగ్‌పై పృథ్వీషా ప్రశంసలు!

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌పై ఆ జట్టు యువ ఓపెనర్ పృథ్వీ షా ప్రశంసల జల్లు కురిపించాడు. పాంటింగ్ చాలా మంచి వ్యక్తని, మైదానంలో బాస్‌గా వ్యవహరిస్తే.. గ్రౌండ్ బయట మాత్రం ఓ స్నేహితుడిలా ఉంటాడని తెలిపాడు. అతని కోచింగ్ అచ్చం 'చక్‌దే ఇండియా'మూవీలోని షార్‌ఖ్ ఖాన్‌లానే ఉంటుందని కొనియాడాడు. పాంటింగ్ టీమ్‌ను ఉద్దేశించి మోటీవేషనల్ స్పీచ్ ఇచ్చేటప్పుడు చక్‌దే ఇండియాలోని సాంగ్‌ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌లా ప్లే చేయాలన్నాడు.

ఇక ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన షా.. భారత జట్టులో చోటు కోల్పోయాడు. అయితే దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ విజయ్ హజారే వన్డే ట్రోఫీలో.. వరుస సెంచరీలతో పాటు విధ్వంసకర ఆటతీరుతో సత్తా చాటాడు. అంతేకాకుండా తన సారథ్యంలో ముంబై జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ టోర్నీతో తిరిగి లయ అందుకున్న షా.. ఐపీఎల్ 2021 సీజన్ కోసం సమాయత్తం అవుతున్నాడు.

బాస్ ఈజ్ బ్యాక్..

2018 సీజన్‌లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన షా.. అప్పటి నుంచి పాంటింగ్ పర్యవేక్షణలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. అయితే తాజా సీజన్ ప్రిపరేషన్స్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మీడియా టీమ్‌తో మాట్లాడిన షా.. పాంటింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘బాస్(పాంటింగ్)ఈజ్ బ్యాక్. అతను చాలా మంచి వ్యక్తి.

మైదానంలో అతను మాతో బాస్‌లా ప్రవర్తిస్తాడు. మైదానం బయట మాత్రం ఓ స్నేహితుడిలా ఉంటాడు. అతను చాలా గొప్ప వ్యక్తి. ఈ సీజన్‌ ఎలా ఉంటుందో చూడాలి. రికీ సార్ మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో షారుఖ్ ఖాన్ సాంగ్ ప్లే చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అతని కోచింగ్ ఆ సినిమాలోని షారూఖ్‌లానే ఉంటుంది.'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.

చక్‌దే ఇండియా సినిమాలానే..

చక్‌దే ఇండియా సినిమాలానే..

ఇక చక్‌దే ఇండియా మూవీలో షారూఖ్ ఖాన్ మహిళల హాకీ టీమ్ కోచ్‌ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కోచ్‌గా ఆటగాళ్లలో స్పూర్తిని నింపి భారత జట్టుకు ప్రపంచకప్ అందిస్తాడు. ఆ తరహాలోనే పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు టైటిల్ అందిస్తాడని షా చెప్పకనే చెప్పాడు. ఎన్నడూ లేని విధంగా గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్‌గా నిలిచిందంటే దానికి కారణం పాంటింగేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ఈ సారైనా ఢిల్లీ టైటిల్ గెలుస్తుందో లేదో చూడాలి. పైగా రెగ్యూలర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయంతో దూరమవడంతో రిషభ్ పంత్ జట్టును నడిపించనున్నాడు.

ఫామ్‌లో లేకుంటే ప్రాక్టీస్ చేయడు..

ఫామ్‌లో లేకుంటే ప్రాక్టీస్ చేయడు..

పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న సమయంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు పృథ్వీ షా ఇష్టపడడని కోచ్‌ రికీ పాంటింగ్‌ చెప్పిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2020లో రెండు అర్ధ శతకాలు చేశాక ఫామ్‌ కోల్పోయిన షా నెట్స్‌లో సాధనకు రమ్మంటే తిరస్కరించాడని తెలిపాడు. పరుగులు చేస్తుంటే నిరంతరం బ్యాటింగ్‌ చేస్తూనే ఉండాలనుకుంటాడని తెలిపాడు. గతేడాది నాలుగైదు మ్యాచుల్లో 10 రన్స్‌ లోపే ఔటవ్వడంతో నెట్స్‌లో సాధన చేస్తూ ఎక్కడ తప్పు జరుగుతుందో చూద్దామని చెప్పానని, కానీ అతను తనకు ఆసక్తిలేదని తేలిగ్గా చెప్పేశాడని ఈ ఆసీస్ దిగ్గజం చెప్పుకొచ్చాడు. బహుశా షా ఇప్పుడు తన శిక్షణా పద్ధతులు మార్చుకొని ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.

వైఖరి మార్చుకుంటే..

వైఖరి మార్చుకుంటే..

‘బహుశా పృథ్వీ షా ఇప్పుడు తన వైఖరి మార్చుకొని ఉండొచ్చు. కొన్ని నెలలుగా బాగా కష్టపడ్డాడు. అత్యుత్తమంగా ఆడితే సూపర్‌ స్టార్‌ అవుతాడు. షా పట్ల నేను కాస్త కఠినంగానే ఉన్నా. నువ్వు నెట్స్‌కి వెళ్లి సాధన చేయాలని గట్టిగా చెప్పాను. నువ్వు చెబుతున్న థియరీ పనిచేయదని చెప్పా. సరైన ఫలితాలు రాకపోతే.. కోచ్‌గా నేను వాళ్ల సన్నద్ధతను ప్రశ్నించగలను. సాధన చేయాలని చెప్పినా అతడు విన్లేదు. ఫలితంగా పరుగులు చేయలేదు. అతడు వైఖరి మార్చుకుంటే భారత్‌కు సుదీర్ఘంగా ఆడగలడు. బ్యాక్‌ ఫుట్‌, ఫ్రంట్‌ఫుట్‌ను చక్కగా ఆడతాడు. స్పిన్‌ను దూకుడుగా ఎదుర్కోగలడు' అని పాంటింగ్ పేర్కొన్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 7, 2021, 15:55 [IST]
Other articles published on Apr 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X