'మనం విఫలమైనా నమ్మేవాడే తండ్రి,... థాంక్యూ నాన్న'
ముంబయి: మనం విఫలమైనా నమ్మేవాడే తండ్రి అని ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తోన్న యువ క్రికెటర్ పృథ్వీ షా వ్యాఖ్యానించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా పృథ్వీ షా ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు నమోదు చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
హ్యారీస్ షీల్డ్ టోర్నీలో రిజ్వి స్ప్రింగ్ ఫీల్డ్ నుంచి బరిలోకి దిగిన పృథ్వీ షా 330 బంతుల్లో 546 పరుగులు సాధించి తొలిసారి మీడియా దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న పృథ్వీ షా ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా పృథ్వీ తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు.
థాంక్యూ నాన్న
'మనం ఏడ్చినప్పుడు ఎవరైతే మనల్ని ప్రేమగా హత్తుకుంటారో, ఎప్పుడైతే నువ్వు నిబంధలను అతిక్రమిస్తావో అప్పుడు నీ మీద అరిచేవాడు, నువ్వు గెలిచినప్పుడు నిన్ను చూసి గర్వపడేవాడు, విఫలమైన, మనపై నమ్మకం పెట్టుకునేవాడే తండ్రి. థాంక్యూ నాన్న' అని కామెంట్ పెట్టాడు.

ఒడిశాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో సెంచరీ
ఈ ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 17 ఏళ్ల పృథ్వీ షా బుధవారం భువనేశ్వర్‌లో ఒడిశాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన పృథ్వీ షా 153 బంతుల్లో 105 పరుగులు చేసి బసంత్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఒడిశాపై 68.63 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేసిన షా.. 18 బౌండరీలు బాదాడు.

సచిన్ రికార్డుకి రెండు సెంచరీల దూరంలో
రంజీల్లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఓ రికార్డుకు పృథ్వీ షా రెండు సెంచరీల దూరంలో ఉన్నాడు. 18 ఏళ్లు వచ్చే సరికి అత్యధిక సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో సచిన్ (7) ముందు వరుసలో ఉండగా.. పృథ్వీ షా (5) సెంచరీలతో రెండో స్ధానంలో ఉన్నాడు. దీంతో మరో రెండు సెంచరీలు సాధిస్తే పృథ్వీ షా సచిన్ రికార్డుని సమం చేస్తాడు.

ఈ ఏడాది పృథ్వీ ఆడిన ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 4 సెంచరీలు
ఈ ఏడాది పృథ్వీ ఆడిన ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 4 సెంచరీలు (4, 120, 71, 44, 154, 31, 123, 5, 105) నమోదు చేశాడు. నాలుగు సెంచరీల్లో మొదటి మూడు రెండో ఇన్నింగ్స్‌లో చేసినవే. దులీప్ ట్రోఫీలో మరొక సెంచరీని సాధించాడు. దీంతో మొత్తం ఐదు సెంచరీలు సాధించాడు. నవంబరు 9న పృథ్వీ 18వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications