Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Prachi Singh: వైరల్‌ వీడియో.. పృథ్వీ షా గర్ల్‌ఫ్రెండ్‌ 'బెల్లీ డ్యాన్స్' అదరగొట్టిందిగా!!

Prithvi Shaw rumoured girlfriend Prachi Singhs belly dance goes viral

హైదరాబాద్: టీమిండియా, ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఓపెనర్ పృథ్వీ షా.. ప్రాచి సింగ్‌ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంగా పృథ్వీ, ప్రాచి ఒకరినొకరు ఇష్టపడుతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరూ అప్పుడప్పుడూ తమ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుల్లో కామెంట్లు చేసుకుంటూ ఆ పుకార్లకు మరింత బలం చేకూరుస్తున్నారు. దాంతో ఈ యువ సెలబ్రిటీలు జంట పక్షులయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

తాజాగా ప్రాచి సింగ్‌ బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బెల్లీ డ్యాన్స్‌తో ప్రాచి తనలోని డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ను అభిమానులకు పరిచయం చేసింది. వెనకాల బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ వస్తుండగా.. ప్రాచి అద్భుతంగా డాన్స్ చేసింది. 'కరోనా వైరస్ విజృంభిస్తున్నవేళ మీకు ఉపశమనం కలిగించడానికి బెల్లీ డాన్స్ ట్రై చేశా. చూసి ఎలా ఉందో చెప్పండి' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ ప్రాచి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. వీడియో చూసిన ఫాన్స్ 'సూపర్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పృథ్వీ షా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో 6 బౌండరీలు బాదాడు. ఈ క్రంమలోనే 41 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. ఐపీఎల్ టోర్నీలో అజింక్య రహానే తర్వాత ఒకే ఓవర్లో ఆరు బౌండరీలు బాదిన ఘనతను తన పేరుపై లికించుకున్నాడు.

కోల్‌కతా మ్యాచ్‌లో పృథ్వీ షా ఏకంగా ఐదు అవార్డులు గెలుచుకున్నాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో పాటు, సఫారీ సూపర్‌ స్టైకర్‌, , గేమ్‌ ఛేంజర్‌, క్రెడ్‌ పవర్‌ ప్లేయర్‌, అప్‌స్టాక్స్‌ మోస్ట్‌ వాల్యూబుల్‌ అసెట్‌ అవార్డులు షా గెలుచుకున్నాడు. దీంతో ప్రాచి సింగ్‌ అభినందనలు తెలుపుతూ ఓ సెటైర్ వేసింది. షా అందుకున్న అవార్డులన్నింటినీ కలిపి ఒక ఫోటోలో జత చేసిన ప్రాచి.. 'ఆ అవార్డులు అన్ని తీసుకెళ్లడానికి కొత్త సూట్‌ కేసు కావాలేమో' అని కామెంట్‌ చేశారు. ప్రాచి తరచూ తన వర్కవుట్‌ వీడియోలు, డ్యాన్స్‌ వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

Story first published: Thursday, May 6, 2021, 21:39 [IST]
Other articles published on May 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+