Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌ను గుర్తుకు తెస్తోన్న పృథ్వీ షా బ్యాటింగ్‌ టెక్నిక్‌: వా

Prithvi Shaw reminds me of Sachin Tendulkar, says Mark Waugh

హైదరాబాద్: అండర్-19 వరల్డ్ కప్ జట్టు కెప్టెన్, ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఓపెనర్ పృథ్వీ షా బ్యాటింగ్‌ టెక్నిక్‌ చూస్తుంటే దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ గుర్తుకు వస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్‌ వా చెప్పుకొచ్చాడు. పృథ్వీ షా ఆడుతుంటే సచిన్ గుర్తొస్తున్నాడని, అతడికి ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉందని మార్క్ వా తెలిపాడు.

'షాలో తొలుత గమనించేది టెక్నిక్‌. సాంకేతికంగా సచిన్‌లా ఆడుతున్నాడు. అతని గ్రిప్, స్టాన్స్, క్రీజులో నిటారుగా నిలుచునే విధానం, మైదానం నలువైపులా షాట్లు కొట్టే ప్రతిభ.. అన్నిటికీ మించి బంతిని లేట్‌గా ఆడటం, స్ట్రోక్ ప్లేలో పంచ్ కూడా ఉంది. పృథ్వీ ఆటతీరు చాలా వరకు సచిన్‌ను పోలి ఉంది' అని మార్క్‌ వా తెలిపాడు.

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం

ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న పృథ్వీ షా.. ఇప్పటి వరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 166.66 స్ట్రైక్‌ రేట్‌తో 140 పరుగులు సాధించాడు. అంతేకాదు తన రెండో మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించి ఐపీఎల్‌లో చరిత్రలో ఈ రికార్డు సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు.

14 ఏళ్ల వయసులో 546 పరుగులు

14 ఏళ్ల వయసులో 546 పరుగులు

2013లో ముంబై హార్రిస్ షీల్డ్ టోర్నమెంట్‌లో రిజ్వి స్ప్రింగ్‌ఫీల్డ్ స్కూల్ తరుపున 14 ఏళ్ల వయసులో 546 పరుగులు చేయడంతో పృథ్వీ షా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. గతేడాది రంజీ ట్రోఫీలో తమిళనాడుపై అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి అరుదైన ఘనత సాధించాడు.

భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా

భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా

ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డుని కూడా సమం చేశాడు. పృథ్వీ షా భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో పృథ్వీ షా నాయకత్వంలోని అండర్-19 జట్టు న్యూజిలాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌ను నెగ్గిన సంగతి తెలిసిందే.

వేలంలో రూ. 1.2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు

వేలంలో రూ. 1.2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు

వెస్టిండిస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ పృథ్వీ షా పుట్ డ్రైవ్ అచ్చం సచిన్ టెండూల్కర్‌ను పోలి ఉందని అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా కామెంటేటరీలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అండర్-19 వరల్డ్ కప్‌లో పృథ్వీ షా చక్కటి ప్రదర్శన కనబర్చడంతో ఢిల్లీ జట్టు ఈ ఏడాది వేలంలో అతడిని రూ. 1.2 కోట్లకు దక్కించుకుంది.

ఐపీఎల్ చరిత్రలో పిన్న వయస్కుడిగా పృథ్వీ షా

ఐపీఎల్ చరిత్రలో పిన్న వయస్కుడిగా పృథ్వీ షా

ఐపీఎల్‌లో పృథ్వీ షా ఆడటం ఇదే తొలిసారి. శుక్రవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా హాఫ్‌ సెంచరీ సాధించాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో పిన్న వయసులో హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజూ శాంసన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో అతనికిది రెండో మ్యాచ్. కేవలం 38 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 169 రోజుల వయసులో హాఫ్‌ సెంచరీ సాధించగా, శాంసన్‌ కూడా 18 ఏళ్ల 169 రోజుల వయసులోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. విశేషం ఏమిటంటే షా, శాంసన్ ఒక్కరోజు అటూ ఇటూ తేడా లేకుండా ఒకే వయసులో ఈ ఘనత సాధించడం.

Story first published: Friday, May 4, 2018, 14:39 [IST]
Other articles published on May 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+