

హైదరాబాద్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి యువ ఆటగాడు పృథ్వీషా అరంగేట్ర మ్యాచ్‌కి సిద్ధమయ్యాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరగనున్న తొలి టెస్టులో పృథ్వీషా తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సమాయత్తమవుతున్నాడు.
చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగిన పృథ్వీషా న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆఖరి రెండు టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ ఆడే అవకాశం రాలేదు.
ఆ తర్వాత దేశవాళీ క్రికెట్, ఇండియా-ఏ జట్ల తరుపున ఆడిన తక్కువ మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారించడంతో 18 ఏళ్లకే భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా విండిస్‌తో గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో అరంగేట్రం చేస్తున్నాడు.
తొలి టెస్ట్‌కు ముందే తుది జట్టులో ఆడే 12 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఆ జాబితాలో పృథ్వీ షాకు జట్టు మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది. దీంతో తన తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ కోసం బుధవారం నెట్స్‌లో పృథ్వీషా తీవ్రంగా చెమటోడ్చాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను సలహా అడిగి మరి తన బ్యాటింగ్ టెక్నిక్ మెరుగుపరచుకున్నాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. రాజ్‌కోట్ టెస్ట్‌లో ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడనికి సిద్ధమైన పృథ్వీ షా... తొలి టెస్టు ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.