
గిల్ కచ్చితంగా ఆడతాడు..1
వన్డే ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తున్న గిల్‌ను ఈ మ్యాచ్‌లో ఆడిస్తామని పాండ్యా క్లారిటీ ఇచ్చాడు. 'శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. దీంతో కొత్త వారికి అవకావం ఇవ్వాలనే ఆలోచనే రాలేదు. తన ఆటతీరు చాలా మెరుగైంది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా అతను ఆడాడు కదా' అని పాం్డయా చెప్పాడు. లంక సిరీస్‌లో గిల్ అంత గొప్పగా రాణించని సంగతి తెలిసిందే.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా తొలి మ్యాచ్ మినహా ఆ సిరీస్‌లో రాణించలేదు. దీంతో కివీస్‌పై పృథ్వీ షా ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ అవకాశం లేదని పాండ్యా స్పష్టం చేశాడు.

గెలిచేందుకు ప్రయత్నిస్తాం..
ఈ సిరీస్‌లో సాధ్యమైనన్ని మ్యాచులు గెలవడానికి తాము ప్రయత్నిస్తామని పాండ్యా అన్నాడు. న్యూజిల్యాండ్ టీ20 జట్టు గొప్పగా ఉందని, వన్డే సిరీస్‌లో ఫలితాన్ని మార్చలేకపోయినా వాళ్లది బలమైన జట్టేనని చెప్పాడు. కివీస్ జట్టు ఎప్పుడూ ప్రత్యర్థికి సవాళ్లు విసురుతూనే ఉంటుందన్నాడు. దీనికి హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేను ఉదాహరణగా పాండ్యా గుర్తుచేశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసినా.. కివీస్ జట్టు గెలిచినంత పని చేసింది.

వన్డే సిరీస్ ప్రభావం ఉండదు..
ఈ సిరీస్‌లో తాము శాయశక్తులా గెలిచేందుకే ప్రయత్నిస్తామని, అయితే గెలవాలంటే కివీస్ కన్నా చాలా మెరుగైన ఆట ఆడాల్సి ఉంటుందని పాండ్యా అన్నాడు. వన్డే సిరీస్ ఓడిన ఒత్తిడి కివీస్‌పై ఉంటుందని పాండ్యా అనుకోవడం లేదు. 'ఆ మూడు మ్యాచుల్లో ఓటమి ఈ సిరీస్‌పై ప్రభావం చూపుతుందని నేను అనుకోవడం లేదు. వాళ్లను తక్కువ అంచనా వేయకూడదు. ఏ జట్టుకైనా ఫ్రెష్‌గా సిరీస్ మొదలు పెట్టడం చాలా ముఖ్యం' అని తేల్చిచెప్పాడు.


Click it and Unblock the Notifications












