
ఢిల్లీ: సోమవారం సమావేశమైన ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ న్యూజిలాండ్‌లో పర్యటించే మూడు వేర్వేరు భారత-ఎ జట్లను ఎంపిక చేసారు. ఎనిమిది నెలల సస్పెన్షన్ ముగించుకొని దేశవాళీల్లో సత్తాచాటుతున్న యువ ఓపెనర్ పృథ్వీ షాను ఈ పర్యటన కోసం ఎంపిక చేసారు. తొలుత జరిగే పరిమిత ఓవర్ల ఫార్మాట్ కోసం భారత-ఎ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
గిల్ నేతృత్వంలో దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్, సందీప్, మహ్మద్ సిరాజ్ ఆడనున్నారు. టెస్టు సిరీస్ సన్నాహాల్లో భాగంగా జరిగే రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం తెలుగు క్రికెటర్ హనుమ విహారీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ ఎంపికయ్యారు. ప్రియాంక్ పంచల్, ఈశ్వరన్, అవేశ్‌ఖాన్, పోరెల్, ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు.
వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు కూడా వన్డే సిరీస్ జట్టులో చోటు దక్కింది. నాలుగు రోజుల పాటు జరిగే రెండు టెస్టుల్లో టీమిండియా ఆటగాళ్లు అంజిక్య రహానె, ఛతేశ్వర పుజార, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆడనున్నారు. అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లకు టీమిండియా జట్లను ఎంపికచేశారు. ఎడతెరిపి లేకుండా మ్యాచ్‌లాడుతున్న వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పేసర్ షమీకి శ్రీలంక సిరీస్ నుంచి విశ్రాంతి లభించింది. వెన్ను నొప్పి కారణంగా దూరమైన జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.
India A squad for two tour matches and three one-day games: Prithvi Shaw, Mayank Agarwal, Ruturaj Gaikwad, Shubman Gill (captain), Suryakumar Yadav, Sanju Samson, Ishan Kishan (wicket-keeper), Hardik Pandya, Krunal Pandya, Axar Patel, Rahul Chahar, Sandeep Warrier, Ishan Porel, Khaleel Ahmed, Mohd. Siraj.
India A squad for 1st four-day game: Prithvi Shaw, Mayank Agarwal, Priyank Panchal, Abhimanyu Easwaran, Shubman Gill, Hanuma Vihari (captain), KS Bharat (wicket-keeper), Shivam Dube, Shahbaz Nadeem, Rahul Chahar, Sandeep Warrier, Avesh Khan, Mohd. Siraj, Ishan Porel, Ishan Kishan.
India A squad for 2nd four-day game: Prithvi Shaw, Mayank Agarwal, Shubman Gill, Cheteshwar Pujara, Ajinkya Rahane, Wriddhiman Saha (wicket-keeper), Hanuma Vihari (captain), KS Bharat (wicket-keeper), Shivam Dube, R Ashwin, Shahbaz Nadeem, Sandeep Warrier, Avesh Khan, Mohd. Siraj, Ishan Porel.