15తో ముగిసియనున్న నిషేధం: సెలక్షన్‌కు అందుబాటులో పృథ్వీ షా, ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉంటాడా?

హైదరాబాద్: నిషేధిత ఉత్ప్రేరకం వాడటంతో టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాపై ఈ ఏడాది మార్చిలో బీసీసీఐ ఎనిమిది నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిషేధం నవంబర్ 15తో పూర్తి కావడంతో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ కోసం పృథ్వీ షాను తిరిగి ముంబై జట్టులోకి ఎంపిక చేయనున్నారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం పృథ్వీ షా ఎంపికపై ఖచ్చితంగా చర్చించనున్నట్లు రాష్ట్ర తాత్కాలిక ఎంపిక ప్యానెల్ చైర్మన్ మిలింద్ రీజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నవంబర్ 16 నుండి పృథ్వీ షా క్రికెట్ ఆడేందుకు అర్హుడు. కాబట్టి అతడిని సెలక్షన్‌కు పరిగణనలోకి తీసుకుంటాం. అతను ఖచ్చితంగా జట్టులో తిరిగి చోటు దక్కించుకుంటాడా? అనే దానిపై నేను కామెంట్ చేయను. అతడి ఎంపిక గురించి ఖచ్చితంగా చర్చిస్తాము" అని తెలిపాడు.

తొలి మూడు మ్యాచ్‌లకు జట్టుని ప్రకటించిన ముంబై
ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లకు మాత్రమే రీజ్ ప్యానెల్ ముంబై జట్టును ప్రకటించింది. ఎందుకంటే శ్రేయాస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్, శివం దుబే వంటి కీలక ఆటగాళ్ళు ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరిగే టి20 సిరీస్ కోసం భారత జట్టులో ఆడుతున్నారు. మరోవైపు పృథ్వీ షా అర్హత సాధించడానికి ముందే ముంబై ఏడు గ్రూప్ మ్యాచ్‌ల్లో ఆరు ఆడుతుంది.

పృధ్వీ షా నిషేధం వెనుక అసలేం జరిగింది?
ఈ ఏడాది ఫిబ్రవరి 22న ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షల్లో పృథ్వీ షా విఫలమయ్యాడు. అతడి మూత్ర నమూనాల్లో టెర్బుటలైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. ఇది సాధారణంగా దగ్గు మందుల్లో ఉంటుందని పేర్కొన్న బీసీసీఐ.. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల ప్రకారం మ్యాచ్‌లు ఆడేటపుడు లేదా బయట కూడా దీనిని ఉపయోగించకూడదు.

పృథ్వీ షాకి బీసీసీఐ నోటీసులు
అయితే, జులై 16నే పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే బీసీసీఐ పృథ్వీ షాకి నోటీసులు జారీ చేసింది. దగ్గు మందు వినియోగం వల్లే నిషేధిత ఉత్ప్రేరకం తన ఒంట్లోకి వచ్చిందని పృథ్వీ ఇచ్చిన వివరణతో బీసీసీఐ సంతృప్తి చెందలేదు. దీంతో అతడిపై 8 నెలలు పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం మార్చి 16 నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దీంతో నవంబరు 15కే పృథ్వీ షాకి విధించిన శిక్ష పూర్తి కానుంది.
ట్విట్టర్‌లో వివరణ ఇచ్చుకున్న పృథ్వీ షా
"ఈ ఏడాది నవంబరు, 2019 మధ్య వరకు నేను క్రికెట్ ఆడలేనని ఈ రోజు నాకు తెలిసింది. నేను తెలియకుండా తీసుకున్న దగ్గు మందులో ఉన్న నిషేధిత ఉత్ప్రేరకం ఫలితమిది. ఫిబ్రవరిలో ఇండోర్ వేదికగా ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా తీవ్రమైన దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతూ ఆ మందు వాడాను. ఆస్ట్రేలియా పర్యటనలో అయిన పాదం గాయం నుంచి కోలుకుని, ఆటలోకి తిరిగొస్తున్న సమయంలో ఇది జరిగింది. త్వరగా ఆటలోకి రావాలనే ఆతృతలో నేను వాడే మందు విషయంలో జాగ్రత్త వహించలేదు. అయితే తీర్పును శిరసావహిస్తాను. నేనాడిన చివరి టోర్నీలోనూ గాయపడ్డాను. దాన్నుంచి కోలుకుంటున్న సమయంలో ఈ వార్త నన్ను కుదిపేసింది. ఈ ఉదంతం మిగతా క్రీడాకారులు చిన్న చిన్న మందులు వాడేటపుడు కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తుందని ఆశిస్తున్నా. ఈ సందర్భంగా నాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐకి, సన్నిహితులకు ధన్యవాదాలు. క్రికెట్టే నా జీవితం. భారత్‌కు, ముంబైకి ఆడటం కంటే పెద్ద గౌరవం మరేదీ లేదు. ఈ పరిణామం నుంచి త్వరగా కోలుకుని, మరింత దృఢంగా తయారై వస్తా" అని ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications