Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో అడుగు ముందుకు: అండర్-19 జట్టుకు కెప్టెన్‌కు షా

Prithvi Shaw to Lead India in ICC U-19 World Cup in New Zealand

హైదరాబాద్: దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ముంబై యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా.. వచ్చే ఏడాది జరగనున్న అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు న్యూజిలాండ్‌లో ఈ వరల్డ్‌కప్‌ జరగనుంది.

దీంతో 15 మంది సభ్యులతో కూడిన అండర్‌-19 జట్టును జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ సభ్యులు ఆదివారం ఎంపిక చేశారు. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు వైస్‌ కెప్టెన్సీని బాధ్యతలు అప్పగించారు. హార్విక్‌ దేశాయ్‌ను వికెట్‌ కీపర్‌గాను అతడికి బ్యాకప్‌గా ఆర్యన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

న్యూజిలాండ్‌ బయల్దేరడానికి ముందు డిసెంబర్ 8 నుంచి 22 వరకు బెంగళూరులో సన్నాహక శిబిరాన్ని నిర్వహిస్తారు. కాగా, భారత్‌ గతంలో మూడుసార్లు (2000, 2008, 2012) అండర్‌-19 ప్రపంచ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

భారత అండర్‌-19 జట్టు:
పృథ్వీ షా (కెప్టెన్‌), శుభమ్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), మంజోత్‌ కల్రా, హిమాంశు రాణా, అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌, ఆర్యన్‌ జుయాల్‌ (వికెట్‌కీపర్‌), హార్విక్‌ దేశాయ్‌ (వికెట్‌కీపర్‌), శివమ్‌ మావి, కమ్లేశ్‌ నాగర్‌కోటి, ఇషాన్‌ పోరెల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అనుకుల్‌ రాయ్‌, శివ సింగ్‌, పంకజ్‌ యాదవ్‌

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 4, 2017, 13:30 [IST]
Other articles published on Dec 4, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+