For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్, విరాట్, ధావన్‌లతో పాటు పృథ్వీ షా కూడా

Prithvi Shaw Joins the Likes of Tendulkar, Kohli With New Deal

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, స్టీవ్‌వా, ఏబీ డివిలియర్స్‌ ఇదే జాబితాలో 19ఏళ్ల పృథ్వీ షా కూడా చేరిపోయాడు. ఇంతకీ ఈ జాబితా ఏంటనేది ప్రశ్నా.. అదేనంటి ఎమ్మారెఫ్ బ్యాట్ వీరులు వీరు. ఈ మధ్యనే ఎమ్మారెఫ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న ఈ కుర్రాడు ఇప్పుడు ఎమ్మారెఫ్ బ్యాటుతో ఆడనున్నాడు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో వరుస శతకాలతో చెలరేగిన ఈ కుర్రాడు ఎంఆర్‌ఎఫ్‌తో ఒప్పందం కుర్చుకున్నాడు. ప్రముఖ ఆటగాళ్ల ఒప్పందాలను పర్యవేక్షించే బేస్‌లైన్‌ వెంచర్స్‌ సంస్థే పృథ్వీషా వ్యవహారాలను చూస్తోంది. అండర్-19 జట్టు కెప్టెన్ పృథ్వీ షా కు ఇది ఓ గొప్ప పురస్కారమే మరి.

క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తేనే గానీ ఎమ్మారెఫ్ ఒప్పందాలు కుదుర్చుకోదు. వరుసగా పరుగులు చేసే వారిని ఎంపిక చేసుకుని మరి ఒప్పందం కుదుర్చుకునే ఎమ్మారెఫ్ కంపెనీ ఇంతుకుముందు దిగ్గజాలను ఎంచుకున్న సంగతి తెలిసిందే. 1990 నుంచి 2009 వరకు సచిన్‌ ఎమ్మారెఫ్ బ్యాట్‌తో క్రికెట్‌ ఆడాడు. ఈ మధ్యనే పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీతో ఎనిమిదేళ్లకు రూ.100 కోట్లు ఒప్పందం కుదుర్చకున్నాడు. పృథ్వీ షా కూడా న్యూజిలాండ్‌లో త్వరలో జరగబోయే అండర్‌-19 ప్రపంచకప్‌లో ఎమ్మారెఫ్ బ్యాట్‌తో ఆడనున్నాడు.

యుక్తవయసులో సచిన్‌ ఆడిన క్రికెట్‌ను పృథ్వీ తలపిస్తున్నాడు. 2013 నవంబర్‌లో హ్యారిస్‌ షీల్డ్‌ మ్యాచ్‌లో 330 బంతుల్లో 546 పరుగులు చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 2017-18 రంజీ ట్రోఫీలో మూడు శతకాలు పొందాడు. మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో ఆడి 48.81 సగటుతో 537 పరుగులు చేశాడు. ఎమ్మారెఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు పృథ్వీషా సంతోషం వ్యక్తం చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 16, 2017, 14:36 [IST]
Other articles published on Dec 16, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+