షాకు గాయం: వార్మప్ మ్యాచ్‌లో నిరాశపరిచిన భారత బౌలర్లు (వీడియో)

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు 6 వికెట్లకు 356 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది.
నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో వర్షం కారణంగా బుధవారం తొలిరోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. గురువారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ ఎలెవన్ కెప్టెన్ శామ్ వైట్‌మాన్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 92 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌటైంది.
భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ పృథ్వీ షా (66: 69 బంతుల్లో 11 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (64: 87 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్), పుజారా (54: 89 బంతుల్లో 6 ఫోర్లు) రహానే (56 రిటైర్డ్ ఔట్), హనుమ విహారి (53) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టులో నలుగురు హాఫ్ సెంచరీలు
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓపెనర్లు షార్ట్ 72, బ్రయాంట్ 64 పరుగులతో తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆరోన్ హార్డీ 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మూడు వికెట్లు తీసిన షమీ
బౌలింగ్‌లో సైతం ఆరోన్ హార్డీ నాలుగు వికెట్లు తీశాడు. ఇక, భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ షమి మాత్రమే మూడు వికెట్లతో పర్వాలేదనిపించగా అశ్విన్, ఉమేష్ యాదవ్ చెరొక వికెట్ తీసుకున్నారు. వీరు కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకోలేకపోయారు. ఇషాంత్ శర్మ, జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేదు.
ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఓపెనర్ పృథ్వీ షా
కాగా, ఈ మ్యాచ్ డ్రా అయ్యే విధంగా కనిపిస్తోంది. అయితే ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించాలని ఊవిళ్లూరుతోన్న టీమిండియాకు ఇది ఎదురదెబ్బే. అందుకు కారణం తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు ఆధిక్యం దిశగా దూసుకెళ్లడమే. కాగా, ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో అడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్టుకు అతడు దూరమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications