Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అండర్-23 జట్టులో విహారికి చోటు: కెప్టెన్‌గా బాబా అపరాజిత్

హైదరాబాద్: ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఆధ్వర్యంలో ఢాకాలో జరిగే అండర్-23 ఎమర్జెంగ్ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో ముంబై టీనేజీ సెన్సేషన్ పృధ్వీ షా చోటు దక్కించుకున్నాడు. 15 మంది సభ్యులుగల జట్టుకు తమిళనాడు బ్యాట్స్‌మెన్ బాబా అపరాజిత్ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

దేశవాళీ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లను ఈ టోర్నీకి బీసీసీఐ ఎంపిక చేసింది. అండర్-23 జట్టులో బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్, ఆఫ్ స్పిన్నర్ అమీర్ గానీ, లెప్ట్ ఆర్మ్ పేసర్ కనిష్క్ సేథ్ తదితరులు ఉన్నారు. ఇక ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌ గాదె హనుమ విహారికి కూడా జట్టులో చోటు లభించింది.

Prithvi Shaw included in India Under-23 team; Baba Aparajith named captain

ఇటీవలే జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీలో విహారి ఆరు మ్యాచ్‌ల్లో కలిపి 262 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో 23 ఏళ్లలోపు ఆటగాళ్లే పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, ఏసీసీ నిబంధనలు సవరించి 23 ఏళ్లకుపైగా ఉన్న నలుగురు ఆటగాళ్లు జట్టులో ఉండొచ్చని ఢాకాలో మార్చి 15 నుంచి 26 వరకు ఈ టోర్నీ జరగనుంది.

2013లో చివరిసారి జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అంకుశ్ బాయిన్స్ వైస్ కెప్టెన్, వికెట్ కీపర్‌గా వ్యవహారించనున్నాడు. అండర్-19 ప్రాబబుల్స్‌తో కలిపి అండర్-23 జట్టు సభ్యులకు నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+