Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రేయసితో ఉన్న యువ బ్యాటర్ ఫొటోలు వైరల్.. వివరణ ఇచ్చిన స్టార్!

 Prithvi Shaw explains his photos with lady friend in Valentines day

టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను తను చేసే సోషల్ మీడియా పోస్టులతో కూడా చాలా పాపులర్. గతేదాది అతన్ని టీమండియాలోకి తీసుకోకుండా వేరే జట్టును ఎంపిక చేయడాన్ని పృథ్వీ షా జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలో 'చూస్తున్నావా సాయిబాబా?' అంటూ అతను పెట్టిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి అతను చేసిన సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి.

వాలెంటైన్స్ డే సందర్భంగా పృథ్వీ షాకు చెందిన కొన్ని ప్రైవేటు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అతనికి మంచి పరిచయం ఉన్న మోడల్, నటి నిధి తపాడియాతో పృథ్వీ దిగిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు చూసిన వాళ్లందరూ పృథ్వీ షా కూడా త్వరలోనే ఒక ఇంటివాడు అవుతాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవన్నీ ఫేక్ న్యూస్ అని పృథ్వీ తేల్చేశాడు. తనకు, నిధికి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశాడు.

అలాగే ఇలాంటి పోస్టులను నమ్మవదేంధ్ర అని చెప్పాడు. 'నాకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఎవరో ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు ఆటతో కానీ, నాతోకానీ వీటికి ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పటి వరకు ఇలాంటి పోస్టులు ఎప్పుడూ పెట్టలేదు. కాబట్టి వీటిని సీరియస్‌గా తీసుకోకండి. థాంక్స్' అని పృథ్వీ షా తన ఇన్‌స్టా గ్రామ్‌లో తెలిపాడు. అతని వివరణ చూసిన అభిమానుల్లో కొందరు కొంత డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమే అని చెప్పాడు.

టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత జట్టుకు అంతటి విధ్వంసకర ఓపెనింగ్ అందించగలడు అని చాలా మంది పృథ్వీ షాను కొనియాడేవారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల జట్టుకు చాలా కాలంగా పునరాగమన చేస్తాడని అనుకుంటే అది జరగలేదు. అయితే చిట్టచివరకు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లకు అతన్ని ఎంపిక చేశారు. కానీ మ్యాచులో ఆడే అవకాశం మాత్రం అతనికి దక్కలేదు.

Story first published: Tuesday, February 14, 2023, 19:54 [IST]
Other articles published on Feb 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+