Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంగేజ్మెంట్ క్యాన్సిల్? పృథ్వీ షా లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్!

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా, ఆయన కాబోయే భార్య ఆకృతి అగర్వాల్ రిలేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ క్రిప్టిక్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌లో ఆమె 'అనేకసార్లు మోసపోవడం', 'ప్రతి పుకారు నిజమే కావడం' అనే అంశాల గురించి రాసుకొచ్చారు. అయితే ఆకృతి అగర్వాల్ ఆ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే నెటిజన్లు స్క్రీన్ షాట్లు తీయడంతో అవి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే ఈ జంట ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. చాలా కాలం డేటింగ్ చేసిన అనంతరం ఓ అడుగు ముందుకు వేసిన ఈ జంట మధ్య ఇప్పుడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకునేంత గ్యాప్ వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో పృథ్వీ షా పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఆమె రాసిన మాటలు మాత్రమే ఎన్నో అనుమానాలకు వేదికగా నిలిచాయి. ఆ పోస్ట్‌లో ఆకృతి అగర్వాల్ ఇలా రాసుకొచ్చారు. "నన్ను చాలాసార్లు మోసం చేశారు.. అయినా నేనెప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. జీవితంలో ఓ అడుగు ముందుకు వేసిన తర్వాత కూడా ఇలా జరుగుతుందని ఇంకా నమ్మలేకపోతున్నాను.." అంటూ ఆకృతి అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. "అన్నీ నిజమే.. ప్రతి పుకారు నిజమే. సోషల్ మీడియాలో వారి గురించి మీరు చూసేదంతా నిజమే" అంటూ మరో లైన్ జోడించింది. నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఆకృతి అగర్వాల్ చేసిన ఈ కామెంట్లపై ఇప్పటివరకు పృథ్వీ షా గానీ.. ఆకృతి గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Prithvi Shaw Engagement Cancelled Fianc Akriti Agarwal Cryptic Instagram Post Sparks Rumours

ఓ వైపు వ్యక్తిగత జీవితంలో ఇన్ని గొడవలు జరుగుతుండగా.. పృథ్వీ షా ప్రొఫెషనల్ కెరీర్ కూడా ప్రస్తుతం తీవ్ర గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. తన కెప్టెన్సీ భారత్‌కు అండర్-19 వరల్డ్ కప్ అందించిన ఈ స్టార్ ఓపెనర్.. ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగమైనప్పటికీ.. ఫామ్ లేమి, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు. గత కొంతకాలంగా స్టేడియంలో, బయట వివాదాలతో సతమతమవుతున్న పృథ్వీ షా.. ప్రస్తుతం టీమిండియాలోనూ చోటు కోల్పోయాడు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పృథ్వీ షా తన రీఎంట్రీపై ఆశాభావంతో ఉన్నాడు. ఇటీవల తన మానసిక స్థితి, భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడతూ.. "నేను మళ్లీ జట్టులోకి రావడం గురించి ఆలోచించకపోతే ఇక క్రికెట్ ఆడటంలో అర్థమే లేదు. దాని కోసమే నేను శ్రమిస్తున్నాను. భారత్ తరఫున ఆడాలని ఎవరికి ఉండదు? అక్కడ నిలదొక్కుకోవడానికి నేను మూడు రెట్లు ఎక్కవ శ్రమిస్తున్నాను" అని పృథ్వీ షా ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Sunday, July 5, 2026, 18:30 [IST]
Other articles published on Jul 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+