Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Prithvi Shaw: క్లీన్ బౌల్డయ్యానా? అసలు బాల్ ఎప్పుడు వచ్చింది? (Video)

వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ముంబై జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 31/3తో ఇవాళ ఆటను ప్రారంభించిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 45.3 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు ధావల్ కులకర్ణి, షామ్స్ ములాని, తనుష్ కొటియన్ తలో మూడు వికెట్లు తీశారు.

సోమవారం ఆట ప్రారంభమైన కాసేపటికే విదర్భ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ అథర్వా (23; 60 బంతుల్లో)ను కులకర్ణి బోల్తాకొట్టించాడు. ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన యశ్ రాథోడ్ (27; 67 బంతుల్లో) కలిసి ఆదిత్య ఠాక్రే (19; 69 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ ముంబై బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు సాధించారు. విదర్భ 26 పరుగుల వ్యవధిలోనే చివరి ఆరు వికెట్లు కోల్పోయింది.

Prithvi Shaw Clean bowled When did the original ball arrive

అనంతరం 119 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై టీ విరామానికి రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. మొత్తంగా 171 పరుగులు ఆధిక్యంలో నిలిచింది. అయితే యశ్ ఠాకూర్ వేసిన అద్భుతమైన బంతికి ఓపెనర్ పృథ్వీ షా (11; 18 బంతుల్లో) క్లీన్‌బౌల్డయ్యాడు. బ్యాటు, ప్యాడ్‌ల మధ్య నుంచి బంతి దూసుకెళ్లింది. ఇదే తరహాలో పృథ్వీ షా గతంలో ఎన్నోసార్లు ఔటవ్వడం గమనార్హం.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. అయితే బౌల్డ్ అయిన తర్వాత క్రీజులో కాసేపు అలానే పృథ్వీ షా ఉండిపోయాడు. బంతి గమనాన్ని అర్థం చేసుకోలేకపోయాననే నిస్సహాయంగా కనిపించాడు. కాగా, దీనిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రీఎంట్రీలో బలహీనతలు సరిచేసుకోవాలని, ఇంకెన్ని సార్లు ఇదేరీతిలో వికెట్ సమర్పించుకుంటావని కామెంట్లు చేస్తున్నారు. బంతి ఎప్పుడు, ఎలా వచ్చిందో కూడా పృథ్వీ షా తెలియలేదనకుంటా అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 224 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. శార్దూల్ ఠాకూర్ (75; 69 బంతుల్లో), పృథ్వీ షా (46; 63 బంతుల్లో) రాణించారు.

Story first published: Monday, March 11, 2024, 15:21 [IST]
Other articles published on Mar 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+